Online Games: కేంద్రం కొత్త రూల్స్

55
- Advertisement -

ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్‌పై కేంద్రం కొరడా విధించింది. ఆన్‌లైన్ గేమింగ్‌లో బెట్టింగ్ పేరుతో డబ్బు చెల్లింపులు నిషేధమని స్పష్టం చేశారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. ఈ మేరకు ఐటీ నిబంధనలు -2021కి చేసిన సవరణలకు ఆమోదం తెలిపింది. బెట్టింగ్‌తో పాటు, యూజర్లకు హాని కలిగించే, వారి మానసిక స్థితిపై దుష్ప్రభవాలను చూపే ఆన్‌లైన్ గేమ్‌లను‌ నిషేధించామని వెల్లడించారు.

బెట్టింగ్ లేకుండా డబ్బులు చెల్లించి ఆడే ఆన్‌లైన్ గేమ్స్ విషయంలో వినియోగదారుల నుంచి తప్పనిసరిగా కేవైసీని తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఆన్‌లైన్ గేమింగ్‌కోసం కొత్త నిబంధలనుజారీ చేస్తున్నప్పుడు, ఆన్‌లైన్ గేమ్‌లను అనుమతించే ప్రమాణాలను నిర్ణయించడానికి కొత్తగా స్వీయ నియంత్రణ సంస్థ ఉంటుందని చెప్పారు.

ఆన్‌లైన్ గేమింగ్స్ ఆమోదం పొందాలంటే మూడు స్వీయ నియంత్రణ సంస్థ (ఎస్ఆర్‌వో)లను నోటిఫై చేస్తాయి. ఎస్ఆర్‌వోలలో ఒక విద్యావంతుడు, సైకాలజిస్టు, బాలల కోసం పనిచేస్తున్న సంస్థకు చెందిన ఒక సభ్యుడు, ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ నుంచి ఒక ప్రతినిధి.. ఇలా పలు రంగాలకు చెందిన వారు సభ్యులుగా ఉంటారని కేంద్ర మంత్రి తెలిపారు. ఏదైనా ఆన్‌లైన్ గేమింగ్‌ను ఆమోదించాలా? వద్దా అనేది ఈ సంస్థలు నిర్ణయిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -