నేటి నుంచి గ్రాడ్యుయేట్స్ ఓటు నమోదు..

614
New electoral
- Advertisement -

నేటి నుండి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమం మొదలైంది. హైదరాబాద్ – ఉమ్మడి రంగారెడ్డి – మహబూబ్ నగర్ మరియు ఉమ్మడి ఖమ్మం – వరంగల్ – నల్గొండ జిల్లాలకు చెందిన పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవచ్చు. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. మీ అమూల్యమైన ఓటును తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సిందిగా ఎన్నికల సంఘం సూచించింది. అక్టోబర్ 1 నుంచి మీ ఓటు నమోదు చేసుకోవాలి. అలాగే పాత ఓటర్లు సైతం ఓటు నమోదు చేసుకోవాలి. ఓటు నమోదుకు చివరి తేదీ నవంబర్ 6గా నిర్ణయించారు.

ఓటు నమోదుకు కావాల్సిన అర్హతలు..

  • -2017 కంటే ముందు డిగ్రీ/ ఇంజనీరింగ్ పాస్ అయిన గ్రాడ్యుయేట్లు

కావాల్సిన పత్రాలు..

  • -పాసైన డిగ్రీ ప్రొవిజినల్ సర్టిఫికెట్/ మార్కుల మెమో
    -(గెజిటెడ్ ఆఫీసర్ తో సంతకం చేయించిన జిరాక్స్ కాపీ)
  • -ఓటర్ ఐడి కార్డు
  • -పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
  • -మొబైల్ నెంబర్
    -నింపిన ఫారంలను ఎమ్మార్వో / డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఇవ్వాలి.

దరఖాస్తుల షెడ్యూల్‌ వివరాలు..

-పెద్దమొత్తంలో వచ్చే దరఖాస్తులు, పోస్టు ద్వారా వచ్చే దరఖాస్తులను స్వీకరించరు.
-ఫామ్‌-18 ప్రకారం దరఖాస్తుల స్వీకరణకు 2020 నవంబర్‌ 6 చివరి తేదీ.
-ఓటర్ల ముసాయిదా జాబితాను డిసెంబర్‌ 1వ తేదీన ప్రచురిస్తారు.
-క్లెమ్‌లు, అభ్యంతరాల స్వీకరణను డిసెంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు చేపడతారు.
-కైమ్‌లు, అభ్యంతరాలు ఏవైనా ఉంటే జనవరి 12లోగా పరిష్కరిస్తారు.
-ఓటర్ల తుదిజాబితాను జనవరి 18న ప్రచురిస్తారు.

Online Registration: http://ceotserms1.telangana.gov.in/mlc/form18.aspx

- Advertisement -