వివిధ పార్టీల నుండి టీఆర్ఎస్‌లో చేరిక…

151
mla gadari kishore

గతంలో ఎన్నడూ లేనంతగా తుంగతుర్తిలో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్‌. సూర్యపేట జిల్లాలోని నాగారం మండలం మామిడిపల్లి గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు.

ఈ సందర్భంగా మాట్లాడిన గాదరి కిషోర్‌….శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా చరిత్రలోనే తొలిసారిగా వానకాలం పంటకు పూర్తి స్థాయిలో గోదావరి జలాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ సర్కార్ దేనన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీటికి అందిస్తున్నామని చెప్పారు. రానున్న మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేస్తామన్నారు.

టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తాము పార్టీలో చేరుతున్నట్లు వివిధ పార్టీల నుంచి వచ్చిన నేతలు ప్రకటించారు.