త్వరలో నూతన ఎడ్యుకేషన్ పాలసీ

383
Nirmala On Education
- Advertisement -

దేశ వ్యాప్తంగా త్వరలో కొత్త ఎడ్యుకేషన్ పాలసీని ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్‌లో విద్యారంగానికి రూ. 99,300 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. డిగ్రీ స్ధాయిలో ఆన్ లైన్ కోర్సులు ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. రూ. 3000 కోట్లు నైపుణ్యాభివృద్ధి కేటాయిస్తున్నట్టు వివరించారు.

మార్చి 2021 నాటికి అప్రెంటీస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ, డిప్లొమా కోర్సులు ప్రవేశపెడతామని అన్నారు. నేషనల్ పోలీస్ యూనివర్సిటీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లా స్థాయిలో ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల ఏర్పాటు చేస్తామని అన్నారు. త్వరలోనే సింధు, సరస్వతి యూనివర్శిటీలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

- Advertisement -