గబ్బర్ సింగ్ దర్శకుడితో పవన్ కళ్యాణ్ 28వ మూవీ

376
Pawan Kalyan Harish Shankar
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత తిరిగి సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో భారీ విజయం సాధించిన పింక్ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈమూవీలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు. దిల్ రాజు బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈమూవీ ఇటివలే ప్రారంభమైంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి లాయర్ సాబ్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈమూవీలో పవన్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. కాగా పవన్ కళ్యాణ్ ఒకేసారి మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పింక్ రీమేక్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో చేయబోయే మూవీ కూడా ఇటివలే ప్రారంభమైంది.

పవన్ తో ఖుషీ వంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన ఏ ఎమ్ రత్నం ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా పవన్ కళ్యాణ్ మరో మూవీకి సైన్ చేశాడు. పవన్ కళ్యాణ్ కు గబ్బర్ సింగ్ లాంటి భారీ విజయాన్ని అందించిన హరీశ్ శంకర్ పవన్ తో మరో సినిమా చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇప్పుడు మ‌ళ్ళీ 8 సంవ‌త్స‌రాల త‌ర్వాత ప‌వ‌న్, హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో సినిమా రూపొందుతుంద‌నే స‌రికి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. త్వరలోనే ఈమూవీ ప్రారంభంకాబోతున్నట్లు సమాచారం.

Mythri

- Advertisement -