కరోనా కొత్త వేరియంట్‌…ప్రయాణాలపై నిషేధం

315
corona
- Advertisement -

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతుండటం,సెకండ్ వేవ్ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉండటం కాసింత ఊరటనిచ్చినా…యూకేలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది.

ఆరోగ్యమంత్రిత్వశాఖ అత్యవసర భేటీ ఏర్పాటు చేసింది.ఈ సమావేశానికి డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి ఓఫ్రిన్‌తో పాటు కొవిడ్‌-19 ఉమ్మడి పర్యవేక్షణ బృందం హాజరుకానుంది. కరోనా స్ట్రెయిన్‌ ఆవిర్భావం సహా పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

బ్రిటన్‌ సహా ఆఫిక్రాదేశాల్లో కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విజృంభిస్తుండటంతో యూరోపియన్‌ దేశాలు బిట్రన్‌ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. బెల్జియం, నెదర్లాండ్‌, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రియా, ఐర్లాండ్, బల్గేరియా, కెనడా ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.

ఇక భారత్‌లో జనవరి నుంచి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది. టీకా సామర్ధ్యం, భద్రతకే ప్రాధాన్యత ఇస్తామని, పూర్తిస్థాయిలో పరీక్షించిన తరువాతే అనుమతులు ఇస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు.

- Advertisement -