కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ తిరిగి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 20న రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఆదివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానించారు.
జీ-23 నాయకుల డిమాండ్ మేరకు ఆదివారం సీడబ్ల్యూసీ సమావేశానికి సోనియా అధ్యక్షత వహించగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ మినహా సీడబ్ల్యూసీ సభ్యులు, ఆహ్వానితులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో చింతన్ బైఠక్ నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీని పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని, కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలని నేతలంగా ఏకాభిప్రాయానికి వచ్చారు.