8 హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టీలు..

84
CJI NV Ramana

దేశంలో 8 హైకోర్టులకు నూతన చీఫ్ జస్టిస్ ల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. దీంతో పాటు 5 రాష్ట్రాల హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ల బదిలీకి సిఫార్సు చేయగా మరో 17 మంది హైకోర్ట్ జడ్జీల బదిలీకి సిఫార్సు చేసింది. ఈ నెల 16వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో సమావేశమైన కొలీజియం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ను సిఫార్సు చేసిందిసుప్రీంకోర్టు కొలీజియం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, అలహాబాద్ సీజే గా జస్టిస్ రాజేష్ బిందాల్ ,కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టీస్ గా ప్రకాష్ శ్రీవాస్తవ ,కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్ ఆర్ అవస్థి ,మేఘాలయ హైకోర్ట్ సిజే గా జస్టిస్ రంజిత్ వి మోర్ ,గుజరాత్ హైకోర్ట్ సిజే గా జస్టిస్ అరవింద్ కుమార్,మధ్యప్రదేశ్ హైకోర్ట్ సిజే గా జస్టిస్ ఆర్ వి మలిమత్ ని నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.

ఐదుగురు ప్రధాన న్యాయమూర్తుల బదిలీకి సిఫారసు చేసింది. జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ఆంధ్రప్రదేశ్ నుండి ఛత్తీస్‌గఢ్ కు ,మధ్యప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు సిజే మొహమ్మద్ రఫిక్ ను హిమాచల్ ప్రదేశ్ కు ,త్రిపుర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అకిల్ ఖురేషి రాజస్థాన్ కు ,జస్టిస్ ఇంద్రజిత్ మహంతి – రాజస్థాన్ నుంచి త్రిపుర హై కోర్ట్ సిజేగా, మేఘాలయ చీఫ్ జస్టిస్ బిశ్వనాథ్ సోమదర్ సిక్కింకు బదిలీ చేస్తూ సిఫారసు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం.