- Advertisement -
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఛాన్స్లర్గా ఇకపై సీఎం వ్యవహరించేలా కొత్త చట్టం రూపొందించింది . దీనికి మమతా అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో అమోదించారు.
ఇప్పటివరకు రాష్ట్రంలోని యూనివర్సిటీలకు గవర్నర్ ఛాన్స్లర్గా ఉంటుండగా దీనిని మారుస్తూ మమతా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. కొత్త చట్టం ఆమోదం పొందితే, సీఎం ఛాన్స్లర్ అవుతారు. అయితే ఈ బిల్లును గవర్నర్ అమోదించాల్సి ఉంటుంది. ఒకవేళ అమోదం పొందితే ఈ చట్టం అమల్లోకొస్తుంది.
ప్రస్తుతం రాష్ట్రంలోని 17 యూనివర్సిటీలకు గవర్నర్ ఎక్స్-అఫీషియో ఛాన్స్లర్గా కొనసాగుతున్నారు.యూనివర్సిటీల విషయంలో కొంతకాలంగా సీఎం మమతా బెనర్జీ, గవర్నర్ జగ్దీప్ ధన్కార్ మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో మమతా కొత్త చట్టాన్ని తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.
- Advertisement -