ఇంగిత జ్ఞానం ఉందా అనసూయా..!

248
- Advertisement -

తెలుగు బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై హాట్ యాంకర్ గా దూసుకుపోతోంది. అయితే అనసూయ మరీ ఎక్కువగా స్కిన్ షో చేస్తోందని, పొట్టి బట్టలు వేసుకుని సభ్య సమాజానికి ఏం మెసేజ్‌లు ఇద్దామనుకుంటోందని సోషల్ మీడియాలో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. పలు సందర్భాల్లో ఆమె వివరణ ఇచ్చుకున్నప్పటికీ కొందరు మాత్రం అలాంటి కామెంట్స్ చేయడం మానుకోవడం లేదు.

Netizens Counter Attack On Anchor Anasuya Tollywood Gossips

తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రాంలో ఓ నెటిజన్ చేసిన కామెంట్ అనసూయకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ‘‘నీకు ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా అనసూయా.. ఎందుకలా ఎక్స్‌పోజింగ్ చేస్తున్నావు.. మేం ఫ్యామిలీతో కలిసి ప్రోగ్రామ్స్ చూడక్కర్లేదా’’ అని పోస్ట్ చేశాడు.

ఆ పోస్ట్‌పై అనసూయ ఘాటుగా స్పందించింది. తన ప్రోగ్రాం చూడటం నచ్చనప్పుడు చానల్ మార్చుకునే ఆప్షన్ ఉందని, కుటుంబ విలువల పట్ల అంత ప్రేమ ఉన్న మీకు.. మీ భావాలను ఎదుటి వారి మీద రుద్దకూడదన్న సంగతి తెలియదా అని ఆమె ప్రశ్నించింది.

Netizens Counter Attack On Anchor Anasuya Tollywood Gossips

ఎక్స్‌పోజింగే లైంగిక దాడులకు కారణమైతే చిన్న పిల్లలపై, 65 ఏళ్ల ముసలి వారిపై అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయని ఆమె ప్రశ్నించింది. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం తమ పని అని, తమ పరిధులు తెలుసని ఆమె చెప్పింది.

తను ఏం ధరించాలో తన ఇష్టమని.. ఇలాంటివే ధరించాలని ఆదేశించే హక్కు ఎవరికీ లేదని అనసూయ చెప్పింది. మారాల్సింది వస్త్రధారణ కాదని, ఆలోచనా తీరు అని అనసూయ కాస్త ఘాటుగానే బదులిచ్చింది.

- Advertisement -