హాలీవుడ్‌ యాక్షన్‌తో అజిత్‌ అదరగొడుతున్నాడు !

216
Vivekam - Official Telugu Trailer
Vivekam - Official Telugu Trailer
- Advertisement -

త‌మిళ స్టార్ హీరో అజిత్ క‌థానాయ‌కుడుగా రూపొందుతున్న చిత్రం `వివేగం`. టి.జి.త్యాగరాజన్ సమర్పణలో స‌త్య‌జ్యోతి ఫిలింస్ బ్యాన‌ర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని వంశ‌ధార క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ శొంఠినేని తెలుగు ప్రేక్ష‌కుల‌కు `వివేకం` పేరుతో అందిస్తున్నారు. అల్రెడి విడుద‌లైన తెలుగు టీజ‌ర్ ఇప్ప‌టికే సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ విడుదలైంది. యాక్షన్‌ ఘట్టాలు హాలీవుడ్‌ సినిమాని తలపిస్తున్నాయి. ఆగస్టు 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

110 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో జేమ్స్ బాండ్ త‌ర‌హా మూవీగా వివేకం తెర‌కెక్కుతోంది. తొలిసారి అజిత్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా గెస్ట్ పాత్రలో అక్షర హాసన్‌ మెప్పించనుంది. ర‌క్త‌చ‌రిత్ర చిత్రంలో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబ్‌రాయ్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు.ఆ ట్రైలర్‌ పై మీరు ఓ లుక్కేయండి…

- Advertisement -