వెంకీ – రానా కాంబోలో ‘రానా నాయుడు’

111
venki
- Advertisement -

ఐకానిక్ రే డోనోవన్ కథ నుంచి తీసుకున్న ఈ ‘రానా నాయుడు’లో మొదటిసారిగా రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి కలిసి నటించబోతోన్నారు. సెప్టెంబర్ 22, 2021 : బాలీవుడ్ సెలెబ్రిటీలకు ఎప్పుడైనా అత్యవసర సాయం ఏర్పడితే ఎవరికి ఫోన్ చేస్తారో? అని మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? దానికి సమాధానం నెట్ ఫ్లిక్స్ వద్ద ఉంది. అదే రానా నాయుడు. ఆయన ఎలాంటి సమస్యను అయినా సరే ఇట్టే పరిష్కరించగలరు.

దగ్గుబాటి హీరోలు కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విక్టరీ వెంకటేష్, రానా కలిసి నటిస్తే అది కచ్చితంగా తెలుగు ప్రేక్షకులకు పండుగే. బాబాయ్ అబ్బాయ్ కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌ను నెట్ ఫ్లిక్స్ సంస్థ పట్టేసింది. బాహుబలి భళ్లాల దేవ అకా రానా దగ్గుబాటి, అతని బాబాయ్ సూపర్ స్టార్ వెంకటేష్ దగ్గుబాటిలతో ‘రానా నాయుడు’ అనే డ్రామా సిరీస్‌‌ను తెరకెక్కించేందుకు సిద్దమైంది నెట్ ఫ్లిక్స్. లోకోమోటివ్ గ్లోబర్ ఇంక్. అనే సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. అమెరికన్ పాపులర్ డ్రామా ‘రే డోనోవన్’ షో టైం నుంచి కాన్సెప్ట్‌ను తీసుకున్నారు. త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.

ఈ యాక్షన్ డ్రామాలో రానా నాయుడు జీవిత కథ ఉండబోతోంది. బాలీవుడ్‌లో ప్రముఖులకు వచ్చిన సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా కనిపించబోతోన్నారు. ఈ ప్రాజెక్ట్‌ హక్కులను వయకాయ్ సీబీఎస్ గ్లోబల్ డిస్ట్రీబ్యూషన్ గ్రూప్ సొంతం చేసుకుంది. కరన్ అన్షుమాన్ షో రన్నర్ మాత్రమే కాకుండా దర్శకుడిగానూ వ్యవహరిస్తున్నారు. సుపర్న్ వర్న కో డైరెక్టర్‌గా పని చేయనున్నారు.

ఈ సిరీస్ గురించి రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘ఇది నాకెంతో ప్రత్యేకం. నా చిన్నాన్నతో కలిసి మొట్టమొదటి సారిగా నటించడం, అది కూడా నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలో పని చేయడం ఆనందంగా ఉంది. ఇది మా కెరీర్‌లోనే ఎంతో భిన్నమైన ప్రాజెక్ట్. ఇటువంటివి మేం ఎప్పుడూ చేయలేదు. ఇది ఎంతో అద్భుతంగా ఉండబోతోందని నాకు తెలుస్తోంది. ఇందులో భాగస్వామిని అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది సవాల్‌తో కూడుకున్నది అయినా కూడా ఎంతో సరదాగా ఉండోబోతోందనే నమ్మకం ఉంది. సెట్‌లోకి అడుగుపెట్టేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.

వెంకటేష్ దగ్గుబాటి మాట్లాడుతూ.. ‘రానాతో కలిసి పని చేసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఇక మేం ఇద్దరం కలిసి త‌ప్ప‌కుండా ఎంట‌ర్‌టైన్ చేస్తాం.. ఇది మాకు పర్ఫెక్ట్ ప్రాజెక్ట్. నేను రాయ్ డోనోవన్‌కు వీరాభిమానిని. ఈ ప్రాజెక్ట్‌కు పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాను’ అని అన్నారు.

వయకామ్ సీబీఎస్ గ్లోబర్ డిస్ట్రిబ్యూషన్ గ్రూప్. వైస్ ప్రెసిడెంట్, రొక్సాన్నే పొంపా మాట్లాడుతూ.. ‘లోకో మోటివ్ గ్లోబల్ ఇంక్, సుందర్ అరోన్, నెట్ ఫ్లిక్స్‌తో కలిసి రానా నాయుడు కోసం పని చేయడం, ఇండియన్ మార్కెట్‌లోకి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాతృక నుంచి తీసుకున్న స్టోరీ లైన్, మన నేటివిటీకి తగ్గట్టు చేసిన మార్పులు చేర్పులు, ఆ పాత్రకు వారు సరిపయిన విధానం అన్ని కూడా బాగున్నాయి. అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి’ అని అన్నారు.

సుందర్ ఆరోన్ (లోకో మోటివ్ గ్లోబల్ ఇంక్) మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులకు కచ్చితంగా అద్భుతమైన ఫీలింగ్, థ్రిల్లింగ్‌ను ‘రానా నాయుడు’ ప్రాజెక్ట్ ఇస్తుంది. మాకు ఈ ప్రాజెక్ట్ ఎంతో ప్రతిష్టాత్మకమైనది. టాప్ క్వాలిటీ, షో రన్నర్, డైరక్టర్స్, ప్రొడక్షన్ టీం, నెట్ ఫ్లిక్స్ వంటి సంస్థలతో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది. సినిమా షూటింగ్ కోసం, ‘రానా నాయుడు’ను ఈ ప్రపంచానికి పరిచయం చేసేందుకు మేం ఎంతగానో ఎదురుచూస్తున్నాం’ అని అన్నారు.

నెట్ ఫ్లిక్స్ ఇండియా, కంటెంట్, వీపీ , మోనిక షేర్గిల్ మాట్లాడుతూ.. ‘నెట్ ఫ్లిక్స్‌లో మొట్ట మొదటిసారిగా ఇద్దరు అద్భుతమైన స్టార్ హీరోలు రానా, వెంకటేష్‌లతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది. మా మెంబర్స్‌ను ఆశ్చర్యపరిచే, ఆనందింపజేసే కథలను చెప్పాలని మేం ప్రయత్నిస్తుంటాం. రానా నాయుడు కచ్చితంగా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. రానా, వెంకటేష్‌లకు మా సంస్థ తరుపున స్వాగతం పలుకుతున్నాం. ఆ ఇద్దరూ కలిసి చేసే మ్యాజిక్‌ను ప్రేక్షకులకు చూపించేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాం’ అని అన్నారు.

క్రెడిట్స్
నటీనటులు : రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి
ప్రొడ్యూసర్ : లోకో మోటివ్ గ్లోబర్ ఇంక్.
షో రన్నర్ : కరన్ అన్షుమన్
డైరెక్టర్స్ : కరన్ అన్షుమన్, సుపర్న్ వర్మ
ఫార్మాట్ రైట్స్ : వయకామ్ సీబీఎస్ గ్లోబర్ డిస్ట్రిబ్యూషన్ గ్రూప్స్

About Locomotive Global Inc.:
(లోకో మోటివ్ గ్లోబల్ ఇంక్ గురించి)
లోకో మోటివ్ గ్లోబర్ ఇంక్ (LGI)ని 2013లో స్థాపించారు. సుందర్ అరోన్, స్కాట్ అండర్సన్ సంయుక్తంగా కలిసి ఈ సంస్థను నిర్మించారు. LGI అమెరికన్ ఇండియన్ కంపెనీ. ఇక్కడ వినోద రంగంలోని క్వాలిటీ, బెస్ట్ కంటెంట్, టీవీ ఇండస్ట్రీలో మంచి క్వాలిటీని ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. లోకో మోటివ్ గ్లోబల్ మీడియా ఎల్ఎల్‌పీ, లోకో మోటివ్ గ్లోబల్ ఇంక్ కలిసి సంయుక్తంగా పని చేస్తున్నాయి. ఇండియా మీడియా రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పని చేస్తున్నాయి. స్క్రిప్ట్ డ్రామా, ఫీచర్ ఫిల్మ్స్ ఇలా అన్ని అన్ని రకాల కథలను తెరకెక్కిస్తున్నాయి. టీవీ, ఓటీటీల్లో కూడా సేల్స్ ప్రోగ్రాం, డిస్ట్రిబ్యూషన్ వంటి వాటిల్లో LGI యాక్టివ్‌గా దూసుకుపోతోంది. స్టార్ టీవీ, హెబీవో, జీ టెలివిజన్ వంటి చానెల్స్‌లో LGI ఎన్నో రకాల ప్రాజెక్ట్‌లను చేపట్టింది. లేక్‌షోర్ ఎంటర్టైన్మెంట్స్, స్క్రీన్ మీడియా, ఎన్‌బీసీయూ, ఐటీవీ వంటి ఎన్నో సంస్థలతో LGI సత్సంబంధాలను కలిగి ఉంది. ఇక LGI 2019లో సీబీసీ స్టూడియో ఇంటర్నేషనల్/షో టైం డ్రామా సిరీస్ రే డోనోవన్ రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది. ముంబై ఇండియా, లాస్ ఏంజిల్స్‌ కాలిఫోర్నియా లో LGI కార్యాలయాలు ఉన్నాయి.

About ViacomCBS Global Distribution Group:
(వయకామ్ సీబీఎస్ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ గ్రూప్ గురించి)
వినోద ప్రపంచ మార్కెట్ మొత్తంలో ప్రీమియం కంటెంట్ వివిధ మీడియా ఫ్లాట్‌ఫాంలో అందించడంలోనే వయకామ్ సీబీఎస్ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ గ్రూప్ ముందుంది. పారామౌంట్ పిక్చర్స్, పారామౌంట్ టెలివిజన్ స్టూడియోస్, పారామౌంట్ ప్లేయర్స్, పారామౌంట్ యానిమేషన్స్, సీబీఎస్ స్టూడియోస్, సీబీఎస్ మీడియా వెంచర్స్, సీబీఎస్ న్యూస్, షో టైం నెట్‌వర్క్, నికిలోడియన్, ఎంటీవీ ఎంటర్టైన్మెంట్ గ్రూప్, మిరామాక్స్ వంటి ఎన్నో బ్రాండ్‌లతో ముందుకు దూసుకుపోతోంది. క్రైమ్ సీన్స్ ఇన్వెస్టిగేషన్, స్టార్ ట్రెక్, స్పాంజ్‌బాంబ్ స్క్వేర్ పాంట్స్, ట్రాన్స్‌ఫార్మర్స్, మిషన్ ఇంపాజిబుల్ వంటి ఎన్నో అద్భుతమైన సీరిస్‌లను డిస్ట్రిబ్యూట్ చేసింది. ఇంటర్నేషనల్ కో ప్రొడక్షన్, లోకల్ ప్రొడక్షన్‌లోని స్క్రిప్ట్డ్, అన్ స్క్రిప్ట్డ్ ఫార్మాట్‌లోని ఎన్నో ప్రాజెక్ట్‌ల లైసెన్స్ కలిగి ఉంది. వయకామ్ సీబీఎస్ ఇంక్ సంస్థలోని ఓ భాగమే వయకామ్ సీబీఎస్ గ్లోబర్ డిస్ట్రిబ్యూషన్ గ్రూప్.

About Netflix:
(నెట్‌ఫ్లిక్స్‌ గురించి)
ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీడింగ్‌ ఓటీటీ సంస్థల జాబితాలో ముందువరుసలో ఉన్న స్ట్రీమింగ్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ సర్వీస్‌ నెట్‌ఫ్లిక్స్‌. 190 దేశాల్లో 208 మిలియన్ల పెయిడ్‌ మెంబర్‌షిప్స్‌ నెట్‌ఫ్లిక్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ స్ట్రీమింగ్‌ సర్వీసెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. డాక్యూమెంటరీలు, టీవీ సిరీస్‌లు, ఫీచర్‌ ఫిల్మ్స్‌ ఇలా భిన్నరకాలైన వినోదాన్ని నెట్‌ఫ్లిక్స్‌ తమ వ్యూయర్స్‌కు అందిస్తుంది. ఇంటర్‌నెట్‌కు అనుసంధానమై ఉన్న ఓ స్క్రీన్‌పై అయిన…ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా నెట్‌ఫ్లిక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సర్వీసులను పొందవచ్చు.

- Advertisement -