పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లో నేపాల్ జట్టు అరుదైన రికార్డు నెలకొల్పింది. టీ20 క్రికెట్ ఫార్మట్‌లో నేపాల్ తరపున సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా ఆ టీమ్ కెప్టెన్ పరాస్ ఖడ్కా రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో ఇప్పటివరకు కోహ్లీకి కూడా ఈ ఫీట చేయడం సాధ్యం కాలేదు. ఖడ్కా రాణించడంతో ముక్కోణపు సిరీస్‌లో భాగంగా సింగపూర్‌తో మ్యాచ్‌లో నేపాల్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సింగపూర్ 3 వికెట్లు కొల్పోయి 151 పరుగులు చేసింది. సింగపూర్ జట్టులో డేవిడ్ 64,చంద్రమోహన్ 35 పరుగులతో రాణించాడు. 152 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ 16 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కొల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
నేపాల్ కెప్టెన్‌గా ఖడ్కా సెంచరీ చేసి ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. తన ఇన్నింగ్స్‌లో 7 బౌండరీలు, 9 సిక్సర్లుతో 106 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. నేపాల్ జట్టు తన తర్వాత మ్యాచ్ అక్టోబర్ 1న జింబాబ్వేతో తలపడనుంది.