రూ. 31కే మోడీ బీర్‌..!

94
beer

ఇప్పటి వరకు చాలా బీర్ల పేర్లే విన్నాం కానీ…కొత్తగా ఈమోడీ బీర్ ఏంటీ అని అనుకుంటున్నారా.. అవునండి మీరు చూసింది నిజమే.. మోడీ మిత్రోం పేరిట ఢిల్లీలోని ఓ పబ్ .. భలే ఆఫర్ ఇచ్చింది. ముప్ఫై ఒక్క రూపాయి(రూ.31)కే… బీర్లు ఇస్తామంటోంది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఆఫర్ ఇచ్చింది అనుకుంటున్నారా. అలా అనుకుంటే మీరు తప్పులో కాలు చేసినట్టే. అసలు విషయం అది కాదు. ఈ రోజు రాత్రి 7.30 కు ప్రధాని మోడీ జాతినుద్దేశించి మాట్లాడబోతున్నాడు. పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్ మనీపై యుద్ధం ప్రకటించిన మోడీ…ఈ ప్రసంగం ద్వారా నోట్ల రద్దుపై వివరణ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

beer

మోడీ మాట్లాడే సమయం అంతా ఓ బీర్ బాటిల్ కేవలం రూ.31కే అందివ్వనున్నట్లు ప్రకటించింది. ఓ పబ్ తీసుకొచ్చిన ఈ ఆఫర్ ఢిల్లీలో వైరల్ కావటంతో.. మిగతా వాళ్లు ఫాలో అవుతున్నారు. కస్లమర్లను ఎట్రాక్ట్ చేయటం కోసం.. చాలా బార్లు ఆయన మాట్లాడే సుమారు అరగంట( 7.30 నుంచి 8.00 గంటల మధ్యలో) రూ.31ల బీర్ ఆఫర్ ఇచ్చింది. ఇది కూడా అప్పటికే బార్ లోకి వచ్చి ఆర్డర్స్ ఇచ్చినవారికి మాత్రమే అని ప్రకటించింది. స్పీచ్ సమయంలో ఎంట్రీ అయితే ఆఫర్ వచ్చించదంట. మొత్తానికి ఢిల్లీలో ఏ యూత్ ను కదిలించిందినా.. మిత్రోన్ బీర్ ఆఫర్ హాట్ టాపిక్ అయ్యింది.