డాషింగ్ డూరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘మెహబూబా’. 1971 నాటి పాకిస్తాన్-ఇండియా మధ్య జరిగిన యుద్ద నేపధ్యంలో జరిగే ప్రేమ కథతో పూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పూరి తన సొంత నిర్మాణ సంస్థ అయిన పూరి కనెక్ట్‌లో ఈ సినిమా తెరెక్కించారు. అయితే ఇక విషయానికొస్తే ఇందులో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమవుతుంది నేహా శెట్టి. తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది నేహా. తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వులో మాట్లాడుతూ తాను ఈ సినిమాలో వచ్చిన అవకాశం గురించి చెప్పుకొచ్చింది.
నేహా మాట్లాడుతూ…పూరీ జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్‌తో తెలుగు తెరకి పరిచయం కావడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకుని వచ్చానని తెలిపింది. ఆడిషన్స్ అనంతరం పూరీ గారు నన్ను ఎంపిక చేశారని తెలుసుకుని చాలా సంతోషించానన్నారు. ఆకాశ్ తో కలిసి నటించడం హ్యాపీగా వుంది. సెట్లో ఉన్నప్పుడు ఆయన చాలా సరదాగా వుంటాడని, కెమెరా ముందుకు వచ్చాడంటే మాత్రం .. పాత్రలో పూర్తిగా లీనమవుతాడని తెలిపింది నీహా. మే 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.