టాలీవుడులో అతి తక్కువ సమయంలో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవర కొండ. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం విజయ్ ట్యాక్సీవాలా అంటూ ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ లో ఫస్ట్ గేర్ అంటూ సినిమాపై ఆసక్తిని పెంచేశాడు విజయ్. ఆ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో కొద్ది రోజుల క్రితం మరో టీజర్ ని కూడా విడుదల చేశారు. ఈ రెండింటికి మంచి రెస్పాన్స్ రావడంతో ఒక్కసారిగా సినమాపై అంచనాలు పెరిపోయాయి.
ఇక కొద్దిసేపటి క్రితం చిత్ర యూనిట్ మేకర్స్ ది డ్రీమ్ బిహైండ్ టాక్సీవాలా పేరుతో ఓ వీడియో విడుదల చేసింది. ఈ చిత్రం క్లీన్ అండ్ నీట్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని వీడియోలో చిత్ర యూనిట్ చూపించింది. ఇందులో విజయ్ ట్యాక్సీ డ్రైవర్ శివగా పరిచయం కానున్నారు. ఈ సినిమా ట్యాక్సీ డ్రైవర్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇందులో షార్ట్ ఫిలింస్ బ్యూటీ ప్రియాంక జవల్కర్, మాళవిక నాయర్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. రాహుల్ సంకృతియన్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని మే 18న విడుదల కానుంది.
మరోవైపు ఈ సినిమా భారీ మొత్తంలో శాటిలైట్ హక్కులకు అమ్ముడు పోయింది. సినిమాకి పెట్టిన మొత్తం ఖర్చు శాటిలైట్ హక్కులతోనే సంపాదించుకుంది. ఇక థియేటర్స్ నుంచి ఎంత మణి వచ్చినా అది లాభమే అంటున్నారు చిత్ర యూనిట్.

