ప్రియాప్రకాశ్ వారియర్ వైరల్ వీడియో…

213
- Advertisement -

ఒక్కసారి కన్నుకొట్టి లక్షలాది మంది ప్రేక్షకులను సంపాదించుకుని సోషల్ మీడియా క్వీన్‎గా మారింది ప్రియా ప్రకాశ్ వారియర్. ఈ మధ్య చీర కట్టుతో వచ్చి కుర్రకారుల గుండెల్లో నిద్రలేకుండ చేసిన అమ్మడు ప్రస్తుతం ఆమె నటించిన ఒరు ఆదార్ లవ్ నుంచి ‘మాణిక్య మలరాయ పూవీ’ అనే పాటతో మరోసారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో తన క్యూట్ ఎక్స్‎ప్రెషన్స్‎తో యువతను మరోసారి ఫిదా చేస్తుంది. మరోవైపు ఈ 18 ఏళ్ల మలయాళి భామకి ఇన్ స్టాగ్రామ్‎లో రోజు రోజుకు
ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు.

priya prakash another cute video Viral

ఈ వీడియోలో తన కో స్టార్ నుంచి లెటర్ అందుకున్న ప్రియా వెంటనే ఒక ఫ్లైయింగ్ కిస్ ఇచ్చే సన్నివేశం కుర్రకారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్స్, లైక్లు, కామెంట్లతో మార్మోగుతుంది. ఇందులో నలుగురు హీరోయిన్స్ ఉండగా.. ప్రియావారియర్ క్యారెక్టర్ కేవలం 15 నుంచి 20 నిమిషాలు మాత్రమే ఉండేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందట. కానీ ఈ అమ్మడుకు వచ్చిన క్రేజ్‎ని నిర్మాతలు క్యాష్‌ చేసుకోవాలనుకుంటున్నారట. ఈ అమ్మడు పాత్రను
మరింత పెంచేశారు. ఇందుకోసం 40 శాతం సన్నివేశాలను రీషూట్ చేయాలని చిత్ర యూనిట్ ప్ల్యాన్ చేస్తున్నట్లు సమాచారం. మరో నాలుగు నెలల తర్వాత ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.

- Advertisement -