Nivedha:నివేదా థామస్ పై బోల్డ్ కామెంట్స్!

22
- Advertisement -

యంగ్ బ్యూటీ నివేదా థామస్ అనగానే పద్దతిగా ఉంటుంది. అస్సలు బోల్డ్ సన్నివేశాల్లో నటించదు. పైగా నివేదా థామస్ హోమ్లీ నెస్ కి కేరాఫ్ అడ్రస్.. ఇలాంటి మాటలు వినిపించేవి నివేదా థామస్ గురించి. దీనికితోడు నివేదా థామస్ కూడా ఎన్నడూ ఓవర్ గా ఎక్స్ పోజ్ చేయలేదు. అలాగే అనవసరమైన వివాదాలలో దూరి బూతు కామెంట్లు చేయడం లాంటివి కూడా ఎప్పుడూ నివేదా థామస్ చేయలేదు. పైగా ఎప్పుడు సంప్రదాయ పద్ధతిలో కనిపిస్తూ సింపుల్ గా ఉంటుంది. కానీ.. తాజాగా నివేదా థామస్ సింగిల్‌ కాదు, మింగిల్‌ అంటూ ఆమె గురించి ఓ మలయాళ దర్శకుడు చేసిన కామెంట్స్ మాలీవుడ్ సోషల్ మీడియాన ఊపేస్తున్నాయి.

నివేదా థామస్ రిలేషన్‌షిప్‌పై ఆ దర్శకుడు చేసిన ఆ కామెంట్స్ అతని మాటల్లోనే విందాం. ‘ ప్రేమించి పెళ్లి చేసుకున్న కపుల్స్‌ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది. అందుకే, నేను కూడా ప్రేమ వివాహమే చేసుకుంటాను. ఇక నివేదా థామస్ కూడా నాకు మంచి ఫ్రెండ్. ఆమె కూడా ప్రేమే వివాహమే చేసుకుంటుంది. ఆమె పేరేంట్స్‌కు కూడా ఈ విషయం తెలుసు. అసలు, నివేదా థామస్ సింగిల్‌.. కాదు మింగిల్‌ అంటూ ఆ మలయాళ దర్శకుడు చెప్పుకొచ్చాడు.

సౌత్ లో అందంలోనూ అభినయంలోనూ సమానమైన ప్రతిభ చూపించే ముద్దుగుమ్మల్లో నివేదా థామస్ కూడా ఒకరు. అసలు ఈ మల్లు కుట్టి కెరీర్ బిగినింగ్ నుంచి గ్లామర్ షోస్ జోలికి పోకుండా… పెర్ఫార్మెన్స్ తోనే ప్రేక్షకుల మనసు దోచుకుంది. మదర్ ల్యాండ్ మాలీవుడ్ లో లిమిటెడ్ గానే సినిమాలు చేసినా.. తమిళ, తెలుగు సినిమాల్లో మాత్రం బెస్ట్ పెర్ఫార్మర్ గా నివేదా థామస్ గుర్తింపు తెచ్చుకుంది. ఐతే, నివేదా థామస్ కు కాలం కలిసి రాలేదు. మెయిన్ హీరోయిన్ గా నివేదా థామస్ ఎక్కువ ఛాన్స్ లు రాలేదు.

Also Read:మడత పెట్టేదెవరు.. జగనా ? చంద్రబాబా ?

- Advertisement -