Bandi:పాపం బండి.. ఈసారి కూడా డౌటే?

31
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్.. అధ్యక్ష పదవి కోల్పోయిన తరువాత చురుగ్గా వ్యవహరించడం లేదు. అంతకు ముందు పార్టీ వ్యవహారాల్లోనూ, పార్టీ కార్యకలాపాలల్లోనూ ముందుండి పార్టీని నడిపించే బండి సంజయ్.. ఈ మద్య అంటిఅంటనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఆయన పోటీ చేసే స్థానంపై గత కొన్నాళ్లుగా సందిగ్ధత కొనసాగుతూ వచ్చింది. ఆయన అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు విముఖత చూపిస్తున్నారని పార్లమెంట్ ఎన్నికల్లోనే పోటీ చేసేందుకే ఆయన ఆసక్తిగా ఉన్నారని వార్తలు గట్టిగా వినిపించాయి. అయితే అధిష్టానం మాత్రం ఆయనను అసెంబ్లీ ఎన్నికల బరిలోని నిలపాలని ఫిక్స్ కావడమే కాకుండా ఇటీవల ప్రకటించిన మొదటి జాబితాలో ఆయన పేరు ప్రస్తావిస్తూ కరీంనగర్ అసెంబ్లీ సీటును కేటాయించింది అధిష్టానం..

దీంతో బండి సంజయ్ ఏం పాలుపోని స్థితిలో ఉన్నారట. ఎందుకంటే గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బండి సంజయ్ బి‌ఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో ఓటమి చవిచూశారు. దాంతో ఈసారి తప్పదనే భయం బండిని వెంటాడుతోందట. దానికి తోడు జిల్లాలో బండి పై వ్యతిరేకత కూడా గట్టిగానే ఉంది. కేంద్రం నుంచి ఎలాంటి నిధులు తీసుకురాలేదని, మతతత్వ రాజకీయాలు తప్పా.. నియోజకవర్గ అభివృద్ది బండి సంజయ్ కి తెలియదని మెజారిటీ ప్రజల్లో అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యం ఆయనపై ఉన్న వ్యతిరేకతను ముందుగానే ఊహించిన బండి సంజయ్ వీలైనంత వరకు అసెంబ్లీ ఎన్నికలను అవైడ్ చేయాలని చూశారు. కానీ బీజేపీని అభ్యర్థుల కొరత తీవ్రంగా వేధిస్తుండడంతో ఎంపీలను కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలపాల్సిన పరిస్థితి. మరి మొదటి నుంచి కూడా కరీంనగర్ లో తన గెలుపు విషయంలో సందిగ్ధంలోనే ఉన్న బండి సంజయ్ బి‌ఆర్‌ఎస్ దూకుడును తట్టుకొని ఎంతవరకు నిలబడతారో చూడాలి.

Also Read:రస్టిక్‌ థ్రిల్లర్‌.. ‘మంగళవారం’

- Advertisement -