తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీ కాంగ్రెస్ లో సిఎం అభ్యర్థి ఎవరనే ప్రశ్న గత కొన్నాళ్లుగా వెంటాడుతోంది. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న కీలక నేతలంతా సిఎం పదవిపైనే గురిగా ఉండడంతో సిఎం అభ్యర్థి ఎవరనే రచ్చ రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేస్తున్నాయి. రాబోయే పదేళ్ళలో రాష్ట్రానికి సిఎం అవుతానని, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు తన నోరు చేతులు కట్టేస్తున్నారని, అందుకే అని విషయాలు బయటపెట్టలేక పోతున్నానని పార్టీ అంతర్గత వివాదాలపై పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి సిఎం అభ్యర్థి రేస్ లో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటివారు గట్టిగా పోటీ పడుతున్నారు. ఎవరికి వారు సిఎం అభ్యర్హ్తి గా ప్రకటించుకుంటున్నారు. ఇప్పుడు జగ్గారెడ్డి కూడా సిఎం పదవిపై నోరు విప్పడంతో ఇంతకీ హస్తం పార్టీలో సిఎం అభ్యర్థి ఎవరనేది మిస్టరీగా మారింది. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు అయినప్పటికి ఆ పార్టీ నేతలు మాత్రం సిఎం పదవిపై కలలు కంటున్నారు. అత్యాశ అనార్థాలకు దారి తీస్తుందనేది సంగతి బహుశా ఆ పార్టీ నేతలు మరచిపోయారా ? అనేది కొందరు రాజకీయవాదుల్లో ఉన్న అభిప్రాయం. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీ ని ముందుండి నడిపించవలసిన నాయకులు ఇలా ఎవరికి వారు సిఎం అభ్యర్థిగా ఉండేందుకు తహతహలాడుతుండడం అధిష్టానానికి తీవ్ర తలనొప్పిగా మారింది. మరి ఈ చిక్కుముడిని హస్తం పార్టీ అధిష్టానం ఎప్పుడు విప్పుతుందో చూడాలి.
Also Read:Bigg Boss 7 Telugu:ఈ వారం నామినేషన్స్‌లో 8మంది

