కొర‌టాల శివ‌ చేతుల మీదుగా..`నీవెవ‌రో` ఫ‌స్ట్‌లుక్

289
Neevevaro-Movie-First-Look-Poster-
- Advertisement -

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ హీరో హీరోయిన్స్‌గా నటిస్తోన్న చిత్రానికి ‘నీవెవరో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి.సినిమా పతాకాలపై హరినాథ్‌ దర్శకత్వంలో కోన వెంకట్‌, ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ని స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ విడుద‌ల చేశారు.

aadipini shetti

ఈ సంద‌ర్భంగా…కొర‌టాల శివ మాట్లాడుతూ – “ముందు నుండి వైవిధ్య‌మైన చిత్రాల‌ను చేస్తూ కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తే నిర్మాణ సంస్థ‌ల్లో కోన ఫిలిమ్ కార్పొరేష‌న్‌, ఎం.వి.వి. సినిమా బ్యాన‌ర్‌లు ముందుంటున్నాయి. ఈ సంస్థ‌లు మ‌ళ్లీ చేసిన నీవెవ‌రో అనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. ఆదిపినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌లు ఈ సినిమాలో న‌టించ‌డం సినిమా పెద్ద ప్లస్ పాయింట్ అని. సినిమా త‌ప్ప‌కుండా ఎంగేజింగ్ థ్రిల్ల‌ర్ అవుతుంది“ అన్నారు.

నిర్మాతలు కోన వెంకట్‌, ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ – “ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేసి మా యూనిట్‌ను అభినందించిన స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌గారికి థాంక్స్‌. ద‌ర్శ‌కుడు హ‌రినాథ్ సినిమాను ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించాడు. ఆది పినిశెట్టికి మంచి బ్రేక్‌ ఇచ్చే మూవీగా ఇది నిలుస్తుంది. తాప్సీ, రితికా సింగ్ ఇలా ప్ర‌తి ఒక క్యారెక్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేస్తుంది. సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లోనే మిగతా వివరాలను తెలియజేస్తాం” అన్నారు. ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్‌, ఆర్ట్‌: చిన్నా, ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి.

- Advertisement -