నీట్ పేపర్ లీక్..అప్‌డేట్!

1
- Advertisement -

నీట్-యూజీ (NEET-UG) పేపర్ లీక్ కేసులో నిందితులుగా ఉన్న 10 మంది జుడీషియల్ కస్టడీని కోర్టు జూలై 11 వరకు పొడిగించింది. నిందితుల మునుపటి జుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో వారిని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం, నిందితుల కస్టడీని జూలై 11 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

జుడీషియల్ కస్టడీ పొడిగించబడిన ఆ 10 మంది నిందితుల వివరాలను పరిశీలిస్తే.. యష్ యాదవ్,మంగీలాల్ బివాల్,దినేష్ బివాల్,వికాస్ బివాల్,ధనంజయ్ ఖండే,తేజస్ హర్షద్ షా,శుభమ్ ఖైర్నార్,మనీషా వాఘ్మారే,మనీషా హవల్దార్,డాక్టర్ మనోజ్ శిరూరే ఉన్నారు.

Also Read:రేవంత్ మాట్లాడితే బూతుల కంపే!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ వైద్య విద్యా ప్రవేశ పరీక్షలో జరిగిన అక్రమాలు మరియు ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. ఈ కుంభకోణం వెనుక ఉన్న అక్రమ నెట్‌వర్క్‌ను ఛేదించే క్రమంలో దర్యాప్తు సంస్థలు ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేయగా, దీనిపై లోతైన విచారణ ఇంకా కొనసాగుతోంది.

- Advertisement -