కేటీఆర్ పర్యటనలో ప్రజలు, మహిళలు మళ్లీ మీరే రావాలని ఆదరిస్తున్నారు.. అదే నిన్నటి రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటనలో కాంగ్రెస్ కార్యకర్తలే అసభ్యంగా తిట్టుకుంటూ వెళ్లారు.. సొంత ఎమ్మెల్యేలు సభకు రాలేదు అని మండిపడ్డారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.
బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను ముట్టుకోవడం రేవంత్ రెడ్డి తరం కాదు ఆయన తాత తరం కూడా కాదు.. మనుషుల ఎత్తులు, పొడుగుల గురించి.. సబ్జెక్ట్ లేనివాడు, సంస్కారం లేని వాడు మాత్రమే మాట్లాడుతాడు అని దుయ్యబట్టారు.
Also Read:GIC:తెలంగాణ క్రికెట్‌లో కొత్త అధ్యాయం
రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్తే… అక్కడ బూతుల కంపే..కాంగ్రెస్ గద్దెనెక్కిన నాటి నుండి నల్గొండ జిల్లాకు చేసిందేమీ లేదు. నల్గొండలో కనిపిస్తున్న అభివృద్ధి మొత్తం కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిందే అన్నారు.
ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను తొక్కి… పైసలు పెట్టి పదవులు కొని… బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకొని…నీచమైన బూతు భాష మాట్లాడే సంస్కారహీనమైన వ్యక్తివి నువ్వు రేవంత్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా గులాబీ కార్యకర్తలకు మూడు నిమిషాల సమయమివ్వు రేవంత్..నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ చేసిన 3,000 అభివృద్ధి పనులేంటో లెక్కలతో సహా చెప్తారు!కానీ, మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు ముప్పై రోజులు సమయమిచ్చినా…మీరు చేసిన ఒక్క అభివృద్ధి పనిని కూడా చూపించలేరు, చెప్పలేరు అన్నారు.

