- Advertisement -
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్‌లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా సత్తాచాటాడు. జావెలిన్ త్రో ఫైనల్లో రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో పతకం గెల్చిన రెండో భారత అథ్లెట్‌గా అతడు నిలిచాడు. 2003 తర్వాత ఇన్నేళ్ళకు భారత్‌కు పతకం దక్కింది. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్లో ఫైనల్లో గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ అగ్రస్థానంలో నిలిచి, స్వర్ణపతకాన్ని కైవసం చేసుకున్నాడు.
నీరజ్ చోప్రాతో పాటు మరో భారత త్రోయర్ రోహిత్ యాదవ్ కూడా ఫైనల్స్‌కు చేరుకున్నప్పటికీ రాణించలేకపోయాడు. గతంలో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి నీరజ్ చోప్రా మెరిసిన విషయం తెలిసిందే.
- Advertisement -