టార్గెట్ అసెంబ్లీ.. గెలుపు సాధ్యమేనా?

46
- Advertisement -

ఈసారి జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రత్యర్థి పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ తరపున ఎంపీలుగా పని చేసిన నేతలు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు, టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ తరపున ధర్మపురి అరవింద్, బండి సంజయ్ వంటి వారు శాసనసభే ముద్దు అంటున్నారు. మరి ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో వీరి గెలుపు సాధ్యమేనా ? పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో గెలిచే సామర్థ్యం ఉందా ? అనే విషయాలపై రాజకీయ విశ్లేషకులు రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి బరిలోకి దిగి ఓటమిపాలు అయ్యారు. ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా గెలుపొందారు.

ఈసారి కేవలం అసెంబ్లీ ఎన్నికలనే టార్గెట్ చేస్తూ కొడంగల్ మరియు కామారెడ్డి రెడ్డి స్థానాల్లో రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. రెండు చోట్ల రేవంత్ రెడ్డికి గెలుపు కష్టమే అనే వాదన వినిపిస్తోంది. కోడంగల్ లో గతంతో పోల్చితే రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరిగినప్పటికి బి‌ఆర్‌ఎస్ పోటీని తట్టుకొని నిలబడడం కష్టమే అనేది కొందరి వాదన.గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పై పైచేయి సాధించిన పట్నం నరేంద్ర రెడ్డినే మళ్ళీ పోటీలో ఉండటమే అందుకు కారణం..ఇక కామారెడ్డిలో అసలు రేవంత్ రెడ్డికి గెలుపు అనేది ఏడాదిలో ఎండమావుల మాదిరే అనేది కొందరి అభిప్రాయం ఎందుకంటే కామారెడ్డిలో బి‌ఆర్‌ఎస్ అధినేత కే‌సి‌ఆర్ బరిలో ఉన్నారు. దాంతో రెండు చోట్ల కూడా రేవంత్ రెడ్డికి నిరాశే తప్పదనేది ఎక్కువగా వినిపిస్తున్న మాట. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేసి నల్గొండ ఎంపీగా గెలుపొందారు.

మళ్ళీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచే పోటీలో ఉన్నారు.. మరి ఈ సారి ఆయనకు హుజూరాబాద్ ప్రజలు ఎలాంటి తీర్పునిస్తారో చూడాలి. ఇక బీజేపీ తరపున బండి సంజయ్ కరీంనగర్ స్థానానికి పోటీ చేసి గత ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఆ తరువాత అదే స్థానానికి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. అయితే ఈసారి కూడా ఆయనకు కరీంనగర్ లో వ్యతిరేక గాలి గట్టిగానే విస్తోంది. అలాగే నిజామాబాద్ ఎంపీ బీజేపీ నేత ధర్మపురి అరవింద్ కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో కోరుట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు కూడా గెలుపు అవకాశాలు అరకొరగానే కనిపిస్తున్నాయి. ఇంకా అదే పార్టీ నుంచి ఎంపీలుగా పని చేసిన కిషన్ రెడ్డి, సోయం బాపురావు వంటి వారు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మొత్తానికి బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవడంతో వారి గెలుపు సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read:ఎలక్షన్ ఫైట్.. వారసుల పోరు?

- Advertisement -