దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్ సంచలన విజయం

46
- Advertisement -

ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై సంచలన విజయాన్ని నమోదుచేసింది దక్షిణాఫ్రికా. టీ20 వరల్డ్ కప్‌లో సఫారీలను ఓడించిన నెదర్లాండ్..తాజాగా ప్రపంచకప్‌లోనూ షాకిచ్చింది.246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 38 పరుగుల తేడాతో సఫారీలను ఓడించిన నెదర్లాండ్‌కు ప్రపంచకప్‌లో ఇది అతి పెద్ద విజయం.

డేవిడ్‌ మిల్లర్‌ (43), కేశవ్‌ మహారాజ్‌ (40) పరుగులు చేయగా మార్క్మ్‌ (1), డసెన్‌ (4), డికాక్‌ (20), బవుమా (16), క్లాసెన్‌ (28), జాన్సెన్‌ (9) విఫలమయ్యారు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో వాన్‌ బీక్‌ 3, వాన్‌ డెర్‌ మెర్వ్‌, బాస్‌ డీ లీడ్‌, మీకిరన్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

ఇక అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్ నిర్ణీ ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (78 నాటౌట్‌) ,వాన్‌ డెర్‌ మెర్వ్‌ (29), ఆర్యాన్‌ దత్‌ ( 23) పరుగులు చేశారు. ఎడ్వర్డ్స్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Also Read:మగవారు ఇవి తింటే ఎన్ని ప్రయోజనాలో..?

- Advertisement -