KCR:సిద్దపేట రుణం తీర్చుకోలేనిది

19
- Advertisement -

సిద్దిపేటకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను అన్నారు సీఎం కేసీఆర్. నన్ను తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యేంత ఎత్తుకు పెంచిన గడ్డ నా సిద్దిపేట గడ్డ అన్నారు. సిద్దిపేట ప్రగతి ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం…జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ. ఈ మాట అన్నది సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. జన్మభూమిని మించిన స్వర్గం లేదు. సిద్దిపేట పేరు విన్నా.. సిద్దిపేట భూమికి వచ్చినా.. సిద్దిపేట నా మనసులో కలిగే భావన ఇది. ఈ సిద్దిపేట గడ్డ నన్ను సాదింది. చదువు చెప్పింది. నాకు రాజకీయ జన్మనిచ్చిందన్నారు. సిద్దిపేట బీఆర్‌ఎస్‌ అభ్యర్థి హరీశ్‌రావుకి గతంలో వచ్చిన రికార్డు మెజారిటీని తిరగరాస్తూ.. భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇవాళ ఎక్క‌డా చూసినా ప‌చ్చ‌టి పంట పొలాల‌తో ఒక బెత్త‌డి జాగా ఖాళీ లేకుండా వ‌రి నాట్లు క‌న‌డ‌బుతున్నాయని కేసీఆర్ తెలిపారు. ఇది చాలా సంతోషం. మూడు కోట్ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం పండించే నా తెలంగాణ బిడ్డ‌లు.. స‌న్న‌బియ్యం తినాల‌నే ఉద్దేశంతో, వ‌చ్చే ప్ర‌భుత్వంలో స‌న్న‌బియ్యం ఇవ్వాల‌ని మేనిఫెస్టోలో పెట్టుకున్నామ‌ని కేసీఆర్ తెలిపారు.

అబ‌ద్దాలు, మోస‌పు మాట‌ల‌తో, ఆప‌ద మొక్కులు మొక్కుతూ వ‌చ్చే వారుంటారు.. వారి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కేసీఆర్ సూచించారు. ఆప‌ద మొక్కులు మొక్కే వారు చాలా మంది వ‌స్తుంటారు. ఒక పెద్ద ప్ర‌మాదం పొంచి ఉన్న‌ది. రైతు సోద‌రుల‌ను హెచ్చ‌రిస్తున్నా. మూడు సంవ‌త్స‌రాలు రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి ధ‌ర‌ణి పోర్ట‌ల్ తీసుకొచ్చాం. రైతుల భూములు క్షేమంగా ఉండాలి. కౌలుకు ఇచ్చినంత మాత్రాన ఇంకోక‌రి ప‌రం కావొద్దు అని ధ‌ర‌ణిని తీసుకొచ్చాం. రిజిస్ట్రేష‌న్లు పావుగంట‌లో అయిపోతున్నాయి. ధ‌ర‌ణి వ‌ల్ల 98 శాతం మంది రైతుల‌కు మేలు జ‌రిగింది. కాంగ్రెస్ పార్టీ భుజం మీద గొడ్డ‌లి పెట్టుకుని రెడీగా ఉంది. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కూడా ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌స్తే ధ‌ర‌ణిని తీసి బంగాళాఖాతంలో విసిరేస్తార‌ట‌. మ‌ళ్లీ వీఆర్‌వోలు, గిర్దావ‌ర్‌లు వాని భూమి వీనికి రాసి, వాని భూమి ఇంకోక‌రికి రాసి, మ‌ళ్లీ రైతుల‌ను కోర్టుల చుట్టు తిప్పే ప‌రిస్థితి వ‌స్తుంది. మీ మీద వీఆర్వో, గిర్డార‌వ్, డిప్యూటీ త‌హ‌సీల్దార్, త‌హ‌సీల్దార్, ఆర్డీవో, జాయింట్ క‌లెక్ట‌ర్, జిల్లా క‌లెక్ట‌ర్, రెవెన్యూ సెక్ర‌ట‌రీ, సీసీఎల్ఏ, రెవెన్యూ మంత్రి ఉండేవారు. వీరిలో ఒక‌రికి కోప‌మొచ్చినా రైతు భూమి ఆగ‌మ‌య్యేది. కానీ ఇవాళ ఆ అధికారం తీసేసి రైతుల‌కే అధికారం ఇచ్చాం. మీ బొట‌న వేలి ప్ర‌మేయం లేకుండా.. భూమి ఇత‌రుల‌కు పోయే అవ‌కాశం లేదన్నారు.

Also Read:మగవారు ఇవి తింటే ఎన్ని ప్రయోజనాలో..?

- Advertisement -