దేశవ్యాప్తంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బలవంతంగా భాషను రుద్దుతుందని మంత్రి కేటీఆర్ ఆన్నారు. భాషను ఎన్నుకునే హక్కు ప్రజలకుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా స్పందించారు. దేశంలో హిందీ భాషను బలవంతంగా రుద్దితే ప్రజాస్వామ్య విరుద్దమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత రాజ్యంగంలో అన్ని భాషలను గుర్తించినప్పుడు బీజేపీ ప్రభుత్వం మాత్రం హిందీ భాషను ప్రజలపై రుద్దడమంటే…రాజ్యంగం ఉల్లంఘన కిందికే వస్తుందని అన్నారు. భారతదేశానికి జాతీయ భాషంటూ ఏదీ లేదన్నారు. అన్ని భాషల్లాగే హిందీ కూడా ఒక భాష అన్నారు. ఐఐటీలు కేంద్ర ప్రభుత్వం నియమాకాల్లో హిందీ భాషను తప్పనిసరి చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు.
భారతదేశానికి జాతీయ భాషంటూ ఏదీలేదు. అన్ని భాషల్లాగే హిందీ కూడా ఒక అధికార భాష మాత్రమే. ఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో హిందీని తప్పనిసరి చేస్తున్నారు. తద్వారా ఎన్డీఏ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నది. భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలి. హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిద్దాం అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.