ఎన్డీఏకు మరో షాక్‌..

144
hanuman
- Advertisement -

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అధికార ఎన్డీయే కూటమికి క్రమంగా ఒక్కో పార్టీ దూరమవుతోంది. తాజాగా ఎన్డీయే నుంచి వైదొలగింది రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ.ఇప్పటికే ఎన్డీయే నుంచి శిరోమణి అకాలీదళ్ వైదొలగగా రాజస్థాన్‌లో వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపింది రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ.

కొత్త సాగు చట్టాలను రద్దు చేయకపోతే ఎన్డీయే నుంచి వైదొలగుతామని బిజెపిని గతంలోనే హెచ్చరించారు ఆర్‌ఎల్‌పీ చీఫ్ హనుమాన్ బెనివాల్. తాజాగా రాజ‌స్థాన్‌లోని అళ్వార్ జిల్లాలో రైతుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. అన్నదాతలకు వ్య‌తిరేకంగా ప‌నిచేసే ఏ పార్టీకి, కూట‌మికి తాము మద్దతు ఇచ్చేది లేదంటూ కుండబద్దలు కొట్టారు.

మరోవైపు ఈ నెల 29వ తేదీన కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు రైతు నేతలు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.. నాలుగు అంశాల ఎజెండా మంగళవారం 11 గంటలకు కేంద్రంతో చర్చలకు అంగీకరించాయి రైతు సంఘాలు… ఆ నాలుగు అంశాల ఎజెండాను కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ కు లేఖ ద్వారా పంపించాయి రైతు సంఘాలు.

- Advertisement -