జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా సినీనటి బీజేపీ నాయకురాలు ఖుష్బూ నామినేట్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ డైరెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఖుష్బూ ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. మహిళా కమిషన్ సభ్యులుగా నామినేట్ అయిన వారిలో ఖుష్బూతో పాటు మమత కుమారి డెలియానా కొంగ్డుప్ ఉన్నారు.
ఈ సందర్భంగా జాతీయ మీడియాతో ఖుష్బూ మాట్లాడుతూ…ఇంతగొప్ప బాధ్యతను తనకు అప్పగించినందుకు గాను ప్రధాని మోదీకి కేంద్ర ప్రభుత్వానికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మోదీ నాయకత్వంలో నారీశక్తిని పరిరక్షించేందుకు తనవంతుగా కష్టపడి పనిచేస్తానని ఖుష్బూ ట్వీట్టర్ ద్వారా తెలిపారు.
BJP leader Khushbu Sundar is nominated as a Member of the National Commission for Women (NCW)
(Pic 1: File) pic.twitter.com/P70QIzydHS
— ANI (@ANI) February 27, 2023
ఇవి కూడా చదవండి…
2000 వేల నోటు రద్దు ?
మనీష్ సిసోడియా అరెస్ట్ అప్రజాస్వామికం..
మేఘాలయ,నాగాలాండ్ పోలింగ్ అప్‌డేట్..