మహారాష్ట్రలో కూటమివే 35 స్థానాలు!

16
- Advertisement -

మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాల్లో ఆప్ 30-35 సీట్లు గెలుచుకుంటుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో తమ పార్టీని విలీనం చేయడం గురించి ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. కాంగ్రెస్ మరియు ఎన్‌సిపి మొదటి నుండి కలిసి పనిచేస్తున్నాయని…. రెండు పార్టీలు గాంధీ, నెహ్రూల సిద్ధాంతాలను విశ్వసిస్తున్నాయన్నారు.

ఎన్నికల ప్రచారంలో ముస్లిం సమాజంపై కించపరిచే ప్రసంగాలు చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగజారరని మండిపడ్డారు. మొదటి మూడు దశల్లో జరిగిన పోలింగ్ మోడీని కలవరపరిచిందని…అందుకే తన స్వరం మార్చారని తెలిపారు.

మొదటి మూడు దశల ఎన్నికలు నరేంద్ర మోడీకి అనుకూలంగా జరగలేదని అందుకే రెండు దశల పోలింగ్ తర్వాత మతం పేరుతో కామెంట్స్ చేసే స్థితికి దిగజారరన్నారు. బీజేపీతో చేతులు కలపాలనే ప్రతిపాదనతో చాలా మంది నేతలు తన వద్దకు వచ్చారని, అయితే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి తాను ఎప్పుడూ అంగీకరించలేదని పవార్ చెప్పారు.

Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే

- Advertisement -