మళ్ళీ చీలిక.. ఎన్సీపీ వైపే?

42
- Advertisement -

గత కొన్నాళ్లుగా మహారాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. శివసేన, ఎన్సీపీ పార్టీలలో చీలిక, ప్రభుత్వాలు మారడం, బీజేపీ ఎత్తుగడలు.. ఇలా ఎన్నో అంశాలు మహారాష్ట్ర రాజకీయాలను దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యేలా చేశాయి. ఇక ఆ మద్య ఎన్సీపీలోని దాదాపు 20 మంది ఎమ్మేల్యేలు అజిత్ పవార్ ద్వారా షిండే శివసేన వర్గంలో చేరిన సంగతి తెలిసిందే. ఎన్సీపీలో నమ్మిన బంటుగా ఉండే అజిత్ పవార్ ఒక్కసారిగా పార్టీకి వెన్నుపోటు పొడుతూ షిండే వర్గం వైపు వెళ్లడంతో ఎన్సీపీ ఘోరంగా బలహీన పడింది. దాంతో ఎన్సీపీ అధ్యక్షుడిగా ఉన్న శరత్ పవార్ తన అధ్యక్ష పదవికి రాజీనామా కూడా చేశారు. అయితే అసలే చీలిక కారణంగా బలహీన పడిన ఎన్సీపీకి శరత్ పవార్ నాయకత్వం లేకపోతే పార్టీ మరింత డౌన్ అవుతుందని భావించి మళ్ళీ అధ్యక్షుడిగానే కొనసాగారు శరత్ పవార్. .

ఇటు ఎన్సీపీ వీడి శివసేన వర్గంలో చేరిన అజిత్ పవార్ డిప్యూటీ సి‌ఎం పదవి చేపట్టారు. అయితే తాజాగా నేషనల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఎన్సీపీ షిండే వర్గంలో చేరిన ఎమ్మెల్యేలలో దాదాపు 11 మంది తిరిగి ఎన్సీపీ వైపు చూస్తున్నారట. షిండే వర్గంలో వారికి సరైన ప్రదాన్యం కల్పించడం లేదని టాక్. అందుకే వారంతా తిరిగి సొంత గూటికి చేరేందుకు సిద్దమౌతున్నారట. ఇదే గనుక నిజం అయితే అజిత్ పవార్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ఆయన కూడా తిరిగి ఎన్సీపీ గూటికి చేరతారా ? ఒకవేళ చేరే ప్రయత్నం చేస్తే శరత్ పవార్ ఆహ్వానిస్తారా అనేది కూడా సందేహమే. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం షిండే వర్గంలోని ఎమ్మేల్యేలు సైతం పార్టీ మరెందుకు అడుగులు వేస్తున్నారట. దీంతో షిండే ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం లేకపోలేదు. మరి ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా నిలిచే మహారాష్ట్ర రాజకీయాల్లో ఈసారి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

Also Read:రాజకీయాల్లోకి మరో హీరో !

- Advertisement -