జూన్ 8:#NBK108 టైటిల్, ఫస్ట్ లుక్

42
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలిసి #NBK108 తో మాస్, అభిమానులు, ఫ్యామిలీ ఆడియన్స్ కు సరికొత్త అనుభూతిని అందించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు జరుపుకోనున్నారు. బాలకృష్ణ అభిమానులకు ఇది చాలా ప్రత్యేకమైన పుట్టిన రోజు కానుంది. ఎందుకంటే ఈ బర్త్ డే కి చాలా ట్రీట్‌లు ఉన్నాయి. బాలకృష్ణ పుట్టినరోజు (జూన్ 10)కి రెండు రోజుల ముందుగా అంటే జూన్ 8వ తేదీన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నారు. పవర్ ఫుల్ టైటిల్ లాక్ చేశారు. పవర్ ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్ చూసేందుకు మనం మరో మూడు రోజులు ఆగాలి. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పెద్ద సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు.

కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

ఉగాది సందర్భంగా ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్‌లను ప్రజంట్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ల కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

Also Read: హనుమంతుడి కోసం ఓ సీట్

#NBK108కి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. తమ్మి రాజు ఎడిటర్, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. వెంకట్‌ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. NBK108 విజయదశమి (దసరా)కి థియేట్రికల్ విడుదలకు సిద్ధమౌతోంది.

Also Read: ఉఫ్.. ఈ డైరెక్టర్ ని ఎవరికైనా చూపించడ్రా

- Advertisement -