బాలయ్య..అన్‌స్టాపబుల్ దసరా ట్రీట్

168
nbk 107
- Advertisement -

నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తొలి సీజన్‌కు మంచి రెస్పాన్స్‌రావడమే హైయెస్ట్ టీఆర్పీతో టాప్‌ రేటింగ్‌లో నిలిచింది. తాజాగా రెండో సీజ‌న్ స్టార్ట్ చేస్తున్న‌ట్లు ఆహా సంస్థ ఇటీవ‌లే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. రెంబో సీజ‌న్‌ను ఇంకాస్త గ్రాండియ‌ర్‌గా రూపొందిస్తున్న‌ట్లు తెలుస్తుంది. మ‌రి కొద్ది రోజుల్లో సీజ‌న్‌-2 ప్రారంభం కానుంది.

ఈ లిస్ట్‌లో పవన్‌ కళ్యాణ్‌, చిరంజీవి, ప్రభాస్‌, అనుష్క, త్రివిక్రమ్‌ వంటి పలువురు స్టార్‌లు రానున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ షో ట్రైలర్‌ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2 ట్రైలర్‌ను అక్టోబర్‌ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో బాలయ్య కౌ బాయ్‌ గెటప్‌లో వెనక్కి తిరిగి ఉన్నాడు.

ప్ర‌స్తుతం బాల‌య్య…గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘NBK107’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

- Advertisement -