NBK 109:లేటెస్ట్ అప్‌డేట్

53
- Advertisement -

గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహ నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో #NBK108 చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక NBK 109ని కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ సినిమాని అనౌన్స్‌చేయగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

Also Read:దక్షిణకొరియా సాగు విధానం భేష్..

ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్‌‌ లో కనిపించబోతున్నాడని, తండ్రీ కొడుకుల పాత్రలో బాలయ్య నటించనున్నాడని, ముఖ్యంగా తండ్రిగా బాలయ్య గెటప్ ఓ రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. తండ్రి పాత్ర ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో రివీల్ అవుతుందని, 70 ఏళ్ల పెద్దాయనగా బాలయ్య ఈ సినిమాలో నటిస్తున్నాడట. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

Also Read:గురుపౌర్ణమి.. భక్తుల రద్దీ

- Advertisement -