బాల‌య్య ఓల్డ్ గెటప్ లు మెప్పిస్తాయా?

44
- Advertisement -

ప్ర‌స్తుతం అనిల్ రావిపూడితో భ‌గ‌వంత్ కేసరి చేస్తున్న బాల‌య్య, త‌న 109వ‌ సినిమాను బాబీతో చేయ‌నున్నాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లి వీలైనంత త్వ‌ర‌గా షూటింగ్ ఫినిష్ చేయాల‌ని బాలయ్య చూస్తున్నాడు. పొలిటిక‌ల్ ట‌చ్ ఉన్న ఈ సినిమాను ఏపీలో ఎల‌క్ష‌న్స్ కంటే ముందే రిలీజ్ చేయాల‌ని, మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్లు టాక్. మ‌రి ఇదెంత‌వ‌ర‌కు సాధ్య‌మ‌వుతుందో డౌటే. కారణం.. దర్శకుడు బాబీ కూడా షూటింగ్ కి చాలా టైం తీసుకుంటాడు. పైగా బాలయ్య సినిమా అంటే ఫుల్ యాక్షన్ సీన్స్ ఉంటాయి.

కాబట్టి, షూటింగ్ కి ఎక్కువ డేట్స్ కావాలి. పైగా ఈ సినిమాలో బాల‌య్య డ్యూయ‌ల్ రోల్ చేయ‌నున్నాడ‌ట‌. తండ్రీ కొడుకుల పాత్ర‌ల్లో బాల‌య్య క‌నిపించ‌నున్నాడని, తండ్రి పాత్ర‌లో బాల‌య్య గెట‌ప్ అదిరిపోనుంద‌ని తెలుస్తోంది. ఇందులో బాల‌య్య 70 ఏళ్ల వ‌య‌స్కుడిగా క‌నిపించ‌నున్న‌ట్లు టాక్. ఇందులో వాస్త‌వమెంతన్న‌ది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే.. బాలయ్యని ఓల్డ్ గెటప్ లో ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది కూడా డౌటే.

Also Read:మహేష్ ఫ్యాన్స్‌కి రాజమౌళి ట్రీట్!

అన్నట్టు బాల‌య్య ప్రస్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న భ‌గవంత్ కేస‌రి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా బాలయ్య ఓల్డ్ ఏజ్ పాత్రలోనే నటిస్తున్నాడు. పైగా యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురు పాత్రలో నటిస్తోంది. మరి వరుసగా రెండు సినిమాల్లోనూ బాలయ్య ఓల్డ్ ఏజ్ పాత్రలు చేయడం నిజంగా విశేషమే. ఇంతకీ బాలయ్య ముసలి గెటప్ లు ఆడియ‌న్స్‌ను ఏ మేర‌కు మెప్పిస్తాయో చూడాలి.

Also Read:కొర్రలు తింటే.. ఎన్ని ఉపయోగాలో!

- Advertisement -