NKR21:’డెవిల్’ ట్రీట్ రెడీ

37
- Advertisement -

వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ నందమూరి కల్యాణ్ రామ్. బింబిసారతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన కల్యాణ్ రామ్ తాజాగా 21వ సినిమాకు డెవిల్ అనే పేరును ఖరారు చేశారు. నవీన్ మేడారం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా పుష్ప రచయిత శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించగా దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషలలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది.

Also Read:కీరవాణి కెరీర్ మార్చిన సినిమా అదే

పీరియాడిక్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ని జూలై 5న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్‌. మరి ఈ భారీ సినిమా గ్లింప్స్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. కల్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Also Read:‘దేవ‌ర’ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్

- Advertisement -