NBK 108 వర్కింగ్ టైటిల్ తో కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి – నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాలోని ఓ పాట షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో రూ. 5 కోట్లతో భారీ సెట్ నిర్మిస్తున్నారు. ఆ సెట్ లోనే బాలకృష్ణ, శ్రీలీలపై ఎంతో గ్రాండ్ గా ఈ పాటను రూపొందిస్తున్నట్లు సమాచారం. బాలకృష్ణ సినీ కెరీర్ లోనే ఒక పాట కోసం ఈ స్థాయిలో ఖర్చు పెట్టడం ఇదే మొదటిసారి. ఇదే విషయాన్ని చిత్రబృందం సన్నిహిత వర్గాలు తెలిపాయి. అలాగే ఈ సినిమా ఓటీటీ రైట్స్ కి సంబంధించి కూడా ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ బాలయ్య సినిమాను ఏకంగా రూ. 36 కోట్లు ఇచ్చి డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తున్నాయి. రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , శ్రీలీల కీలక పాత్రలలో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో లేడీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. పైగా పెళ్లి అయిన లేడీగా కాజల్ నటిస్తోంది. మరి కాజల్ బాలయ్య సినిమాకి ఎంతవరకు న్యాయం చేస్తోందో చూడాలి.
ఇక ఈ చిత్రంలో బాలయ్య సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ముఖ్యంగా మూడు గెటప్స్ లో బాలయ్య లుక్ ఉంటుంది. ఐతే, అరవై ఏళ్ల వ్యక్తిగా ఈ సినిమాలో బాలయ్య నటిస్తున్నాడు. ఈ అరవై ఏళ్ల వ్యక్తి లుక్ మాత్రం సినిమాకే హైలైట్ గా నిలుస్తోందట. అలాగే మిడిల్ ఏజ్డ్ పర్సన్ గా కూడా బాలయ్య నటిస్తున్నాడు. ఈ సినిమాకి ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా, సిరామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మరి ఈ మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రికార్డులు సృష్టిస్తోందని టీమ్ నమ్ముతుంది.
ఇవి కూడా చదవండి..