హీరోయిన్ గా మళ్లీ ఫామ్ లోకి రావడానికి నజ్రియా నజీమ్ ‘అంటే సుందరానికి’ అనే సినిమా చేసింది. పైగా ఈ ఏడాది మరో రెండు తమిళ సినిమాల్లో కూడా నటిస్తోంది. అయితే, నజ్రియా నజీమ్ కి సెకండ్ ఇన్నింగ్స్ లో ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం దక్కలేదు. అందుకే, ఇక హీరోయిన్ గా సినిమాలు చేయకూడదు అని నిర్ణయం తీసుకుందట. ఆమె జీవిత భాగస్వామి ఫహాద్ ఫాజిల్ కారణంగానే నజ్రియా సినిమాలకు దూరం కావాలని నిర్ణయించుకుందని టాక్ నడుస్తోంది.
నజ్రియా సినిమాల్లో ఎక్స్ పోజింగ్ చేయడం ఫహాద్ ఫాజిల్ ఫ్యాన్స్ కి నచ్చట్లేదు. ఈ విషయంలో ఆమెని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు కూడా. ఈ విషయంలో ట్రోలింగ్ కన్నా మరో విషయంలో ఎక్కువ బాధపడుతుంది నజ్రియా. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… “హాద్ ఫాజిల్ నేను పెళ్లి చేసుకున్న తర్వాత నేను కొన్ని ఏళ్ల పాటు సినిమాలు చెయ్యలేదు. మధ్యలో ఓ సినిమా చేస్తే.. పెళ్లి అయ్యాక మళ్లీ నీకు ఇక సినిమాలు ఎందుకు కామెంట్స్ పెట్టేవారు అప్పట్లో. కొన్ని అసభ్యకరమైన కామెంట్స్ కూడా చేశారు. అవి చదివి మా ఆయన బాగా నొచ్చుకున్నారు. అప్పుడే ఇక నేను సినిమాలు చేయకూడదు అని నిర్ణయించుకున్నాను’ అని నజ్రియా చెప్పింది.
ఇవి కూడా చదవండి..