హీరో నానిపై నజ్రియా షాకింగ్‌ కామెంట్స్‌..!

89
Nazriya
- Advertisement -

నాని లేకుండా ఈ జర్నీ ఇంత మెమరబుల్‌గా వుండేది కాదు. నాని గొప్ప కోస్టార్ అని హీరోయిన్ నజ్రియా చెప్పుకొచ్చింది. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘అంటే సుందరానికీ’. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్ లో అభిమానుల మధ్య వేడుకగా జరిగింది. హీరో నాని, హీరోయిన్ నజ్రియా, నిర్మాత వై రవి శంకర్ పాటు చిత్ర బృందం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొని సందడి చేశారు.

ఈ వేడుకలో హీరోయిన్ నజ్రియా మాట్లాడుతూ.. వైజాగ్ గురించి చాల గొప్ప విన్నాను. ఇక్కడకి రావడం చాలా ఆనందంగా వుంది. గత ఏడాది నా సినీ ప్రయాణం గొప్ప అనిపించింది. ‘అంటే సుందరానికీ’తో మొదటి తెలుగు సినిమా చేయడం, తెలుగులో డబ్బింగ్ చెప్పడం, ఇప్పుడు వైజాగ్ రావడం ఈ మూడు గొప్ప ఆనందాన్ని ఇచ్చాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, రవి శంకర్‌కి కృతజ్ఞతలు తెలిపింది. మైత్రీ మూవీ మేకర్స్ లేకుంటే ఈ ప్రయాణం ఇంత గొప్పగా జరిగేది కాదని చెప్పింది నజ్రియా. దర్శకుడు వివేక్ ఆత్రేయతో వర్క్ చేయడం చాలా గొప్ప అనుభూతి అన్నారు.

ప్రతి రోజు షూటింగ్ ని ఎంజాయ్ చేశాను. నన్ను, కథని ఎంతో అందంగా చూపించిన సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మికి కృతజ్ఞతలు, అలాగే లతా నాయుడు పల్లవి.. అందరికీ థ్యాంక్స్. నానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పాలి. నాని లేకుండా ఈ జర్నీ ఇంత మెమరబుల్‌గా వుండేది కాదు. నాని గొప్ప కోస్టార్. ఇది నా మొదటి తెలుగు సినిమా. మీరంతా నాపై చాలా ప్రేమని చూపించారు. మీరు చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలుతున్నాను అన్నారు. తప్పకుండా మరిన్ని తెలుగు సినిమాలు చేస్తాను. జూన్ 10న అందరం థియేటర్ లో కలుద్దాం. ‘అంటే సుందరానికీ’ ఎంజాయ్ చేద్దాం” అని నజ్రియా అన్నారు.

- Advertisement -