‘మా’ ఎన్నికలపై హీరో వెంకటేష్ కామెంట్స్‌..

86
Venkatesh Daggubati

హీరోగా విక్టరీ వెంకటేష్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ”నారప్ప”. ఇది తమిళ్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ‘అసురన్’ చిత్రానికి రీమేక్. వి క్రియేషన్స్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై కలైపులి ఎస్.థాను – సురేష్ బాబు కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ చిత్రం.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా జూలై 20న రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో హీరో వెంకటేష్ మీడియా మాట్లాడుతూ ‘నారప్ప’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆ విశేషాలు.

‘నారప్ప’ తన కెరీర్‌లోనే సవాల్‌ విసిరిన పాత్ర అని విక్టరీ వెంకటేశ్‌ అన్నారు. ఎమోషన్స్‌, మాస్‌, యాక్షన్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం కోసం శారీరకంగా, మానసికంగా చాలా శ్రమించానని ఆయన తెలిపారు. అలాగే ‘మా’ఎన్నికలు, జరుగుతున్న వివాదాల గురించి ఆయన్ను ప్రశ్నించగా ‘‘ఏదీ మన చేతుల్లో లేదు. ఏదైనా జరగొచ్చు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. ఎలక్షన్ల నేపథ్యంలో జరిగే విమర్శలు, మాటల తూటాలు శాశ్వతం కాదు’’ అని సమాధానమిచ్చారు.