కాబోయే భర్తకు సర్ ప్రైజ్ ఇచ్చిన న‌య‌న‌తార‌..

52
Nayanthara,

న‌య‌న‌తార‌- విఘ్నేష్ శివన్ పికలోతు ప్రేమలో మునిగి తెలుతున్న విషయం తెలిసిందే. ఈ జంట ఎప్పుడు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంటారు. పెళ్లి కాలేద‌నే కాని వీరిద్దరు చెట్టాప‌ట్టాలు వేసుకోవ‌డం, క‌లిసి పండుగ‌లు, పార్టీలు జ‌రుపుకోవ‌డం, ఒకరి ఇంట్లో ఫంక్ష‌న్‌కి మ‌రొక‌రు వెళ్ల‌డం చేస్తూ వ‌స్తున్నారు. రీసెంట్‌గా విఘ్నేష్ శివ‌న్.. న‌య‌న తార త‌ల్లి బ‌ర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయ‌గా, అందుకు సంబంధించిన పిక్స్ వైర‌ల్‌గా మారాయి.

ఇదిలా ఉంటే.. శనివారం విఘ్నేశ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తానెంతో బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ.. కాబోయే భర్త మీద తనకున్న కొండంత ప్రేమను ప్రదర్శించి సర్ ప్రైజ్ చేసింది నయనతార. విఘ్నేశ్ స్నేహితుల్ని అతని బర్త్ డే పార్టీకి పిలిచి.. గ్రాండ్ గా నిర్వహించింది. దీంతో.. విఘ్నేశ్ ఫిదా అయ్యాడు. నయన్.. తన జీవితంలో భాగమైనందుకు.. వరుస షూటింగ్స్ ఇతర పనులతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికి తన కోసం ఇంత అందమైన సర్ ప్రైజ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ తంగమై’ అంటూ పొగిడేశారు. తన బర్త్ డే వేళ నయన్ ప్లాన్ చేసిన పార్టీకి సంబంధించిన ఫోటోల్ని షేర్ చేశాడు.