సిరి బండారం బయటపెట్టిన నాగ్‌..

76

సరయు ఎలిమినేట్ అయిన తరువాత హౌస్‌లో సిరి ఆడుతున్న నాటకాలను బయటపెట్టింది.. గేమ్‌ని బయట ప్లాన్ చేసుకుని వచ్చి ఇక్కడ డ్రామాలు ప్లే చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇక టాస్క్‌లో భాగంగా సన్నీ తన షర్ట్‌లోకి చేయి పెట్టాడంటూ గోల గోల చేసింది డ్రామా ప్లే చేసింది.. అందర్నీ నమ్మించి కోట్లమంది ప్రేక్షకుల సాక్షిగా సన్నీని బ్యాడ్ చేసింది. ఆ తరువాత కూడా.. సన్నీ గురించి ఇంటి సభ్యుల దగ్గర ప్రస్తావిస్తూ బ్యాక్ బిచ్చింగ్‌కి పాల్పడింది. ఆడపిల్ల షర్ట్‌లో చేయిపెట్టడం ఏంటని సన్నీని అందరూ ఆడిపోసుకున్నారు. తన అద్భుత నటనతో అందర్నీ నమ్మించి మార్కులు కొట్టేసిన సిరి బండారం మొత్తం బయటపెట్టారు నాగార్జున.

శనివారం నాటి ఎపిసోడ్‌లో.. సన్నీ నీ షర్ట్‌లో చేయిపెట్టడం నిజమేనా? నువ్ హౌస్‌లో చేస్తున్నవన్నీ రైట్ అని అనుకుంటున్నావా? అని సూటిగా అడిగారు నాగార్జున. టాస్క్‌ల పరంగా నేను రైట్ చేస్తున్నా అని సిరి చెప్పడంతో ఆమె బండారం బయటపెట్టారు నాగార్జున. ‘సన్నీ నీ టీషర్ట్‌లోపల చేయి పెట్టాడా??’? అంటే.. ‘అవును పెట్టి తీశాడు’ అని చెప్పింది.. శ్వేత కూడా అక్కడే ఉందని చెప్పింది సిరి. అయితే శ్వేత మాట్లాడుతూ.. చేయి పెట్టడం అయితే నేను చూడాలేదని చెప్పింది. షణ్ముఖ్ నువ్ చూశావా?? ఆమె టీషర్ట్‌లో సన్నీ చేయిపెట్టాడా? అని అడగడంతో.. అవును సార్ అతని చేయిని టీషర్ట్ లోపల చూశా అని చెప్పాడు. అయితే సన్నీ మాత్రం.. నేను చేయిపెట్టలేదు సార్.. పట్టుకున్నా అంతే.. ఆ చేయి ఎవరు పెట్టారో.. ఎవరు చూశారో కూడా నాకు తెలియదు అని అన్నాడు. ఆ తరువాత కూడా సిరి దగ్గరకు వెళ్లి.. నేను చేయిపెట్టలేదని చెప్పినా ఆమె వినలేదని చెప్పాడు సన్నీ. సర్లే ఈ గొడవ అంతా ఎందుకు ఓసారి వీడియో చూద్దాం అంటూ అప్పటి వీడియోను ప్లే చేసి చూపించారు నాగార్జున. ఆ వీడియోలో సన్నీ.. సిరి షర్ట్ లోపలికి చేయిపెట్టలేదని.. క్లియర్‌గా కనిపించింది. సిరి షర్ట్‌లో ఉన్నది శ్వేత చేయి అని కనిపించింది.

అయితే అప్పటి వరకూ సన్నీ తన షర్ట్‌లో చేయిపెట్టాడని రచ్చ చేసిన సిరి.. వీడియో చూసిన వెంటనే ప్లేట్ మార్చేసింది. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది సార్.. క్లారిటీ రాకపోయినా.. నేను సన్నీ దగ్గరకు వెళ్లి సర్లే యాక్సిడెంటల్ జరిగిందిలే అని చెప్పాను.. లైట్‌లే అని అనేశా అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. దీంతో నాగార్జున ఆమెకు లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకారు.. చేసిందంతా చేసి ఒక వ్యక్తి క్యారెక్టర్‌ని డిసైడ్ చేసి.. ఇప్పుడు పోనీలే అంటే ఎలా?? ప్రేక్షకులు ఏమనుకుంటారు..? సన్నీ చేసింది తప్పని అనుకోరా?? నువ్ గేమ్ ఆడు.. వాళ్లతో గేమ్స్ ఆడకు.. నా షర్ట్‌లో చేయిపెట్టాడని నువ్ అంటే అది నిజమని అనుకోరా?? నువ్ నెక్ట్స్ టైం ఇలా చేయకు.. ఇది అందరికీ వార్నింగ్. ఒకరి మీద నింద వేసేటప్పుడు నిజం ఏంటో తెలుసుకోండి.. అంటూ సిరికి ఇచ్చిపడేశారు నాగార్జున. అయితే చివర్లో సారీ సార్.. అని నాగార్జున కోరిక మేరకు సన్నీకి హగ్ ఇచ్చింది.

దీంతో సన్నీ చేతులు జోడించి థాంక్యూ సార్.. దీన్ని క్లియర్ చేసినందుకు.. నేను అలాంటి తప్పు చేయనని సిరికి చెప్పినా వినలేదు. అమెతో పాటు షణ్ముఖ్ కూడా అలా ఎలా చేస్తావ్ అని అడిగాడు.. నేను చేయలేదని చెప్పినా వినలేదు.. అది చాలా బాధకలిగిందని ఎమోషనల్ అయ్యాడు సన్నీ.అయితే నేను కేవలం సరికి మాత్రమే చెప్పలేదు.. షణ్ముఖ్ నీకు కూడా.. నిజం ఏంటో తెలుసుకో అని నాగార్జున అనడంతో.. సారీ సార్ నేను రాంగ్ చేశా అని అంటూ సన్నీకి క్షమాపణ చెప్పాడు షణ్ముఖ్. మొత్తంగా తన షర్ట్‌లో చేయిపెట్టాడని సింపథీ క్రియేట్ చేసుకుని గేమ్ ఆడిన సిరి బండారాన్ని బయటపెట్టి సన్నీని కడిగిన ముత్యం చేశారు నాగార్జున.