‘మాయ’ వంటి హార్రర్ కమ్ హీరోయిన్ ఒరియంటెడ్ చిత్రాలతో తమిళం, తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నయనతార ఇదే తరహా చిత్రాల్లో నటించేందుకు అమితాసక్తి చూపుతోంది. తాజాగా ఆమె సంతకం చేసిన ‘డోరా’ కూడా హీరోయిన్ ప్రాధాన్య చిత్రమే. అంతేకాదు, హీరో లేకుండానే ఈ చిత్రం తెరకెక్కుతోంది. మర్డర్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరిగే హర్రర్ థ్రిల్లర్ సబ్జెక్టుతో డోరా తెరకెక్కుతోంది.
ఇక కోలీవుడ్‌లో నయన్‌కు ఉన్న ఫాలోయింగే వేరు. ఈ అమ్మడు కనిపిస్తే చాలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే అంతగా తమిళ ప్రేక్షకులు కనెక్టయి పోయారు. ఇటు గ్లామర్‌తో అటు నటనతో ఆకట్టుకుంటున్న ఈ భామ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో కుమ్మేస్తోంది. ఇక నయన్ లేటెస్ట్ సినిమా డోరాతో మరింత పాపులరైపోయింది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌తో అదరగొట్టిన నయన్ తాజాగా టీజర్‌తో హిల్లేరియస్‌గా అలరించింది.
ఇక ఇవాళ సాయంత్రం 7 గంటలకు తెలుగు టీజర్, ఆడియో లాంఛ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరగనుంది.ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు ఆడియో లాంచ్ సందర్భంగా తాజాగా నయనతార స్టిల్ మరొకటి వదిలారు. ఎల్లో కలర్ పంజాబీ డ్రెస్ లో .. స్పెడ్స్ పెట్టుకుని నయనతార చాలా సింపుల్ గాను కనిపిస్తోంది. ఒక పాత టీవీఎస్ ఫిఫ్టీకి ఒక వైపున హ్యాండ్ బ్యాగ్ .. మరో వైపున కూరగాయల సంచులు తగిలించుకుని బయలుదేరుతున్నట్టుగా వుంది. సహజత్వానికి దగ్గరగా వున్న ఈ స్టిల్ ఆకట్టుకుంటోంది. వరుస సక్సెస్ లను అందుకుంటూ వెళుతోన్న నయనతారకి, ఈ సినిమాతో మరో హిట్ లభించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.