ఉదయనిధి స్టాలిన్…’నాయకుడు’

67
- Advertisement -

ఉదయనిధి స్టాలిన్, వడివేలు మరియు ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలు పోషించిన తమిళ చిత్రం మామన్నన్‌. పరియేరుమ్ పెరుమాల, కర్ణన్ లాంటి విజయవంతమైన చిత్రాలు అందించిన మరి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.మామన్నన్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. దీనితో దర్శకుడు హ్యాట్రిక్ హిట్స్ కంప్లీట్ చేయనున్నారు.

తెలుగులో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్, కీర్తి సురేష్ కూడా నటించిన ఈ చిత్రం తెలుగు హక్కులను పొందాయి. ‘నాయకుడు’ అనే టైటిల్‌తో ఈ చిత్రం జూలై 14న తెలుగు రాష్ట్రాల థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం తమిళంలో అద్భుతాలు చేయడంతో పాటు, ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్‌లు దీనికి మద్దతు ఇవ్వడంతో ‘నాయకుడు’ తెలుగులో గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

Also Read:‘బ్రో’ థియేట‌ర్ల‌లో ‘భోళా శంక‌ర్’!

విడుదల తేదీ పోస్టర్ లో వడివేలు, ఉదయనిధి స్టాలిన్, ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్‌ల ముఖాల్లో ఇంటెన్సిటీ మన దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఉదయనిధి పూర్తి స్థాయి రాజకీయ జీవితాన్ని చేపట్టే ముందు నటుడిగా చేసిన చివరి చిత్రం కావడం విశేషం.

ఈ చిత్రానికి ఉదయనిధి రెడ్ జెయింట్ సినిమాస్ మద్దతు ఉంది. టెక్నికల్ టీం లో ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ AR రెహమాన్, సినిమాటోగ్రాఫర్ తేని ఈశ్వర్, ఎడిటర్ సెల్వ ఉన్నారు.తారాగణం: ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్, లాల్, సునీల్.

Also Read:GST బ్యూటీతో ఆర్జీవీ..ఫోటోలు వైరల్‌!

- Advertisement -