మాకు డ్రగ్స్ ఎలా ఉంటదో తెలియదు..

234
Navadeep, Nandu response on drug rocket
Navadeep, Nandu response on drug rocket
- Advertisement -

డ్రగ్స్ ముఠాతో తమకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటులు స్పష్టం చేశారు. టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో వీరు స్పందించారు. డ్రగ్స్ ముఠాతో తనకు ఎలాంటి సంబంధం లేదని హీరో నవదీప్ తెలిపాడు. కెల్విన్ తన పేరు చెప్పాడని మీడియా చెబుతుండడంతో ఆశ్చర్యపోయానని నవదీప్ అన్నాడు. గత నెలలో రాంగ్ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థతో అసోసియేట్ అవ్వడం వల్ల తన పేరు బయటకు వచ్చిఉంటుందని నవదీప్ అనుమానం వ్యక్తం చేశాడు. అంతే కాకుండా గతంలో డ్రగ్స్ అంశంలో పేర్లు వెలుగు చూసిన వారిని కూడా విచారణకు పిలుస్తున్నట్టు తనకు సమాచారం ఉందని అన్నాడు. తనకు నోటీసులు వచ్చిన మాట వాస్తవమేనని చెప్పిన నవదీప్, తనకు, డ్రగ్స్ దందాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. సిట్ విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని నవదీప్ చెప్పాడు. అంతవరకు మీడియా ఓపిక పట్టాలని సూచించాడు. తనపై చేస్తున్న దుష్ప్రచారం ఆపాలని నవదీప్ కోరాడు.

ఈ వ్యవహారంతో తనకు ఎటువంటి సంబంధం లేదని హీరో నందు తెలిపారు. తన జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్‌ చూడలేదని.. అలాంటిది మీడియాలో నా పేరు కూడా రావడం ఆశ్ఛర్యానికి గురిచేసిందన్నారు. డ్రగ్స్‌ కేసుతో నాకు సంబంధం లేదన్నారు. అధికారుల నుంచి తనకు ఎటువంటి నోటీసులు అందలేదని చెప్పారు. డ్రగ్స్ విషయంలో యూరిన్, బ్లడ్…ఇలా ఏ పరీక్ష కావాలంటే ఆ పరీక్షకు సిద్ధమని నందు తెలిపాడు. తన జీవితంలో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడలేదని, పాల్పడనని స్పష్టం చేశాడు.

డ్రగ్స్‌ కేసులో తన పేరు బయటపెట్టడం బాధగా ఉందని ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా అన్నారు. డ్రగ్స్‌ విషయంలో తనపై వస్తున్న వార్తలు అవాస్తవమని.. అధికారుల నుంచి నాకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు.

కలకలం రేపుతున్న డ్రగ్స్ దందాకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి.ఈ కేసులో ప్రధాన నిందితుడు, తొలుత అరెస్ట్ అయిన కెల్విన్ నుంచి పూరీ జగన్నాథ్ స్వయంగా మాదక ద్రవ్యాలను కొనుగోలు చేసే వాడని పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. ఆయన డ్రగ్స్ కొన్నట్టు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, ఆయన నుంచి హీరోయిన్ చార్మీ, నటుడు సుబ్బరాజులకు ఇచ్చినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఇక జీశాన్ అనే నైజీరియన్ నుంచి హీరో రవితేజకు పలుమార్లు డ్రగ్స్ వెళ్లాయని సిట్ అధికారులు నిర్ధారించుకున్నారు. ఆ తరువాతే రవితేజకు నోటీసులు పంపాలని నిర్ణయించారు. ఇక సినీ ప్రముఖుల్లో మిగిలిన వారికి నోటీసులు ఇచ్చేందుకు సిట్ రెండో జాబితాను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో మరింతమంది ప్రముఖుల పేర్లు ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -