ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో రూపొందించిన చిత్రం ”నాట్యం”. సంధ్య రాజు ఈ సినిమాతో నటిగానే కాకుండా కొరియోగ్రాఫర్ గా ప్రొడక్షన్ డిజైనర్ మరియు కాస్ట్యూమ్ డిజైనర్ గా అరంగేట్రం చేశారు. రేవంత్ కొరుకొండ ఈ చిత్రానికి దర్శకత్వం – సినిమాటోగ్రఫీ – ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. నిష్రింకాల ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాట్యకళ విశిష్టతను చాటిచెబుతూ తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా? తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే.
కథ: సంప్రదాయ నృత్యానికి ప్రసిద్ధి చెందిన నాట్యం అనే గ్రామంలో సితార (సంధ్యా రాజు) కూడా ఒక డ్యాన్సర్. సితార చిన్నతనంలోనే అద్భుత నర్తకి కాదంబరి కథ గురించి వింటుంది. ఆ కథ పై ఆసక్తితో నాట్యం నేర్చుకుంటుంది. తన గురువు (ఆదిత్య మేనన్) చెప్పిన కాదంబరి కథను ఎప్పటికైనా అందరి ముందు ప్రదర్శించాలని లక్ష్యంగా పెట్టుకుంటుంది. అయితే సితార కోరికకు ఆమె గురువు అడ్డు చెప్పడానికి కారణమేంటి? అసలు కాదంబరి కథ ఏంటి? ఆ కథను సితార ప్రజలందరి ముందు ప్రదర్శించిందా లేదా? సితార జీవితంలో వెస్ట్రన్ డ్యాన్సర్ రోహిత్ (రోహిత్ బెహల్) – హరి (కమల్ కామరాజు) పాత్ర ఏంటి? చివరకు ఆమె కథ ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే ‘నాట్యం’ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్: పతాక ఘట్టాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కాదంబరి ఎపిసోడ్ అలరిస్తుంది. సెట్స్‌పై ఆధారపడకుండా రియల్ లోకేషన్స్‌లో సినిమాను తెరకెక్కించడం సహజత్వాన్ని తీసుకొచ్చింది.
మైనస్ పాయింట్స్: బ్రిటీష్ చరిత్రకు నేటి కాలాన్ని ముడిపెడుతూ కథను బాగా రాసుకున్నారు దర్శకుడు. అయితే ఆ పాయింట్‌ను ఆసక్తికరంగా చెప్పడంలో మాత్రం కొంత కన్యూజన్కు లోనయ్యారు. కథకు కీలకమైన ప్రధానాంశం చిన్నది కావడం..దానిని గురించి చెప్పడానికి అల్లుకున్న సంఘర్షణలో బలం లేకపోవడంతో నిరాసక్తంగా సాగుతుంది. లక్ష్యసాధనలో కథానాయికకు ఎదురయ్యే అవరోధాలన్నీ సినిమాటిక్‌గా ఉంటాయి వాటిలో ఆసక్తి లోపించింది. ఆ అంశాలపై దర్శకుడు దృష్టిపెడితే బాగుండేది. రొటీన్ స్క్రీన్ ప్లే.. సాగదీత సన్నివేశాలు.. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను ఎలివేట్ చేసే బలమైన సీన్స్ లేకపోవడం ఇందులో మైనస్ పాయింట్స్ అని తెలుస్తోంది.
సాంకేతిక విభాగం: నిష్రింకాల ఫిల్మ్స్ బ్యానర్ ప్రొడక్షన్ వాల్యూస్ను అందరూ మెచ్చుకుంటున్నారు. సంప్రదాయ, ఫోక్, వెస్ట్రన్ శైలిలను మేళవిస్తూ శ్రవణ్ భరద్వాజ్ అందించిన సంగీతం బాగుంది. రొటీన్ స్క్రీన్ ప్లే. సాంకేతికంగా సినిమా బాగుందని టాక్.
తీర్పు: మొత్తం మీద ‘నాట్యం’ సినిమా అక్కడక్కడ మాత్రమే మెప్పించిందనిఆడియన్స్ తీర్పు ఇచ్చేశారు.
విడుదల తేదీ: 10/22/2021
రేటింగ్:2/5
నటీనటులు: సంధ్యా రాజు, ఆదిత్య మేనన్
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
నిర్మాత: సంధ్యా రాజు
దర్శకత్వం: రేవంత్ కోరుకొండ