యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ ప్రారంభం

12
- Advertisement -

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. మంచిరేవులలో తొలి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్సీలు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పోలీస్ సిబ్బంది కుటుంబాలకు 50% సీట్లు రిజర్వ్ చేశారు. మిగతా సీట్లను సివిలియన్స్ పిల్లలకు కేటాయించారు. CBSE సిలబస్, అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన చేపట్టనున్నారు.

పోలీస్ స్కూల్‌కు ఏం కావాలన్నా తమ ప్రభుత్వం ఇస్తుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ స్కూళ్లలో బేసిక్ విధానంలోనే లోపం ఉందని.. అందులో మార్పులు తీసుకొస్తామన్నారు. ప్రతి ముఖ్యమంత్రికి ఓ బ్రాండ్ ఉంటుందని.. చంద్రబాబు పేరు చెబితే ఐటీ, రాజశేఖర్ రెడ్డి పేరు చేబితే జలయజ్ఞనం, ఆరోగ్య శ్రీ మాదిరే తన బ్రాండ్ యండ్ ఇండియా అని చెప్పారు.

Also Read:బర్డ్ ఫ్లూ.. ఆ గ్రామంలో ఇంటింటి సర్వే!

దేశానికే రోల్ మోడల్‌గా ఉండేలా ఏర్పాటు చేస్తాం… క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. ఒలంపిక్స్‌లో చిన్న చిన్న దేశాలు మెడల్స్ సాధిస్తున్నాయి. మనం దేశం ఎందుకు సాధించలేకపోతుందో ఒకసారి ఆలోచించాలి అన్నారు రేవంత్ రెడ్డి.

- Advertisement -