నాని దారి చూడు దుమ్ము చూడు.. వీడియో

249
Natural Star Nani's Dhari Chudu Dhummu Chudu Video Song
- Advertisement -

నాని తెలుగు సినీ ఇండ్రస్ట్రిలో మినిమమ్ గ్యారీంటీ హీరో, ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకెళ్లుతున్న నాని, తాజాగా మేకర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని కృష్ణార్జున యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నాని ద్వీపాత్రాభినయం చేస్తున్నాడు. కృష్ణా, అర్జున్ పాత్రలతో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఏప్రిల్ 12న విడుదలకానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను పెంచింది. తాజాగా దారి చూడు దుమ్మూ చూడు మామ.. అంటూ సాగే వీడియో సాంగ్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

హిప్ హాప్ త‌మీజా సంగీతంలో రూపొందిన ఈ పాట సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది. పెంచ‌ల్ దాస్ ఈ సాంగ్‌కి లిరిక్స్ అందించ‌డ‌మే కాదు పాడి అల‌రించాడు కూడా. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, రుక్సాన్ మిర్ కథానాయికలుగా నటిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గరపాటి, హరీశ్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -