క్యాస్టింగ్ కౌచ్ పేరుతో సినిమాల్లో ఛాన్స్‌ల కోసం అమ్మాయిలను వాడుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన నటి శ్రీరెడ్డి. తనకు న్యాయం చేయకపోతే ఫిల్మ్ ఛాంబర్ వద్ద బట్టలు విప్పి నిరసన తెలియజేస్తా అని చెప్పిన శ్రీరెడ్డి అన్నంత పనిచేసింది. శనివారం హైదరాబాద్‌లో ఫిల్మ్ ఛాంబర్ వద్ద పై వస్త్రాలను పూర్తిగా తొలగించి.. అండర్ వేర్‌తో నిరసన తెలిపింది. మాలో సభ్యత్వం ఇవ్వాలని డిమాండ్ చేయగా… శ్రీరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

హీరోయిన్లను లైంగికంగా వేధించే వాళ్లను ఒక్కొక్కరిగా బయట పెడతానని బెదిరించిన నటి శ్రీరెడ్డి, ఓ గంట క్రితం ‘వివా హర్ష’ పేరును తెరపైకి తెచ్చింది. తన ఫేస్ బుక్ ఖాతాలో హర్షతో జరిగిన వాట్స్ యాప్ చాటింగ్ స్క్రీన్ షాట్లను పెట్టింది. తాను షార్ట్ ఫిల్మ్ లో అవకాశం కోరుతూ అతన్ని సంప్రదించానని చెబుతూ, చిన్న చిన్న నటులు కూడా ఇలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించింది.
ఏదైనా చేసుకుని బతకవచ్చుగా? అంటూ తనను ప్రశ్నిస్తున్న వారికి ఇదే సమాధానం అంటూ, తాను చిన్న చిన్న ప్రాజెక్టులు చేసేందుకు కూడా ఎంతో శ్రమించానని, ప్రతి ఒక్కరూ గదికి రమ్మని చెప్పేవారేనని ఆరోపించింది. కాగా, ఈ సంభాషణల్లో శ్రీరెడ్డిని హర్ష తన హోటల్ గదికి రమ్మని పిలుస్తూ ఉండటం, ఆమెకు ఓ అడల్డ్ సైట్ లోని వీడియోలు పంపడం, “నిన్ను చూసి ఆగలేకున్నాను” అని అంటుండటం కనిపిస్తోంది.

